Office Colleagues: ఆఫీస్‌లో మీపై అసూయ ఉన్నవారి పట్ల ఎలా ఉండాలంటే! ప్రస్తుతం ఉద్యోగం చేసే ప్రదేశంలో ఎంతో మంది మన చుట్టూ ఉంటారు. వీరిలో ప్రతి ఒక్కరూ ఒక్కో విధమైన మనస్తత్వం కలిగి ఉంటారు. సీనియర్స్, జూనియర్స్‌తో ముందుగానే దగ్గరై పర్సనల్ విషయాలను షేర్ చేస్తే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆఫీస్‌లో ఎవ్వరినీ మరీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. By Vijaya Nimma 14 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Office Colleagues: ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగం చేసే ప్రదేశంలో ఎంతో మంది మన చుట్టు ఉంటారు. వీరిలో ప్రతి ఒక్కరూ ఒక్కో విధమైన మనస్తత్వం కలిగి ఉంటారు. కొంతమంది మన మనస్సు దగ్గరైతే.. కొంతమందితో అస్సలు కలవలేం.అయితే వీరిలో మరికొంతమందేమో రెండు యాంగిల్స్ చూపిస్తుంటారు. మన ముందు నవ్వుతూనే ఉంటూ.. మన వెనకాల చేసే పనుల గురించి వేరేలాగా చెబుతారు. ఇలాంటి వారి మధ్య చాలామందికి పని చేయాలంటే నచ్చదు. ఆఫీస్‌లో ఇంటి విషయాలు, రిలేషన్‌షిప్ ముచ్చట్లు, ఫ్యాషన్ కహానీలు గురించి అసలు మాట్లాడొద్దు. ఏ విషయం ఎంత వరకూ మాట్లాడాలో అంతవరకే మాట్లాడి కట్ చేస్తే మంచిది. అలాంటి వారి మధ్య సక్రమంగా పని చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1.ముచ్చట్లు ➡ఆఫీసులో పక్క వాళ్లతో ముచ్చట్లు పెట్టడం కామన్. ➡ఎంత స్నేహితులైనా కొన్ని విషయాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చర్చించొద్దు. ➡భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ➡మిమ్మల్ని చిన్నచూపు చూసే అవకాశాలు వస్తాయని గమనించాలి. ➡పరిమితికి మించి విషయాలు పంచుకుంటే ఇబ్బందులు వస్తాయి. 2.క్లోజ్‌గా ఉడ్డొద్దు ➡ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఎవరితోనైనా ఎక్కువ క్లోజ్‌గా ఉండొద్దు. ➡ఎలాంటి వారైనా ఒక పలకరింపు పలకరిస్తే బెటర్. ➡కొత్తవాళ్ళు ఎవరొచ్చినా గమనించి వారితో మంచిగా మాట్లాడాలి. ➡ముందుగానే వారికి దగ్గరై ఏవేవో షేర్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు 3.జూనియర్స్.. ➡సీనియర్స్, జూనియర్స్‌తో తప్పుగా ప్రవర్తిస్తారు ➡మరికొంతమంది జూనియర్స్‌తో కలిసిపోతారు ➡ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు కావున వారితో జాగ్రత్తగా ఉండాలి. ➡కొన్నిసార్లు మంచిగా అనిపించేవారు రెండు రకాల ప్రవర్తన కలిగి ఉంటారు. 4.ఇలా చేయాలి.. ➡ఆఫీస్‌లో ఉన్నంత సేపు మీ దృష్టి పని మీదే పెట్టాలి. ➡ముందు మీకు ఇచ్చిన పనిని విజయవంతంగా చూసుకోండి ➡ఆఫీస్‌లో ఎవ్వరినీ మరీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు ➡మీ పర్సనల్ విషయాలను ఆఫీసు వాళ్లతో షేర్ చేయవద్దు ➡తొందరపడి చెబితే షేర్ వాటి వల్ల సమస్యలు వస్తాయి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #tips #office-colleagues మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి