TS EAPCET : తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల..రిజల్ట్స్ కోసం ఈ లింక్‌ లో చెక్‌ చేసుకోండి!

తెలంగాణ ఈఏపీసెట్‌ (ఎంసెట్‌) పరీక్ష ఫలితాలు శనివారం ఉదయం విడుదల అయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్‌ చేసుకోవాలి.

TS EAPCET : తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల..రిజల్ట్స్ కోసం ఈ లింక్‌ లో చెక్‌ చేసుకోండి!
New Update

TS EAPCET Results : తెలంగాణ ఈఏపీసెట్‌ (ఎంసెట్‌) పరీక్ష ఫలితాలు శనివారం ఉదయం విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను జేఎన్టీయూ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోండి.

తెలంగాణ ఈఏపీసెట్ 2024 పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే TSEAPCET Results 2024 లింక్ పై క్లిక్ చేయాలి.మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్‌ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందొచ్చు.

తెలంగాణ(Telangana) ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ పరీక్షలు మే 9న ప్రారంభమై… 11తో ముగిశాయి. మొత్తంగా ఇంజినీరింగ్ విభాగానికి మొత్తం 2,54,750 మంది దరఖాస్తు చేయగా... వీరిలో 2,40,617 మంది పరీక్షలు రాశారు. ఇక ఫార్మసీ విభాగం పరీక్షలకు 1,00,432 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 91 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 7, 8 తేదీల్లో నిర్వహించిన ఈఏపీసెట్‌(ఎంసెట్) పరీక్షల ప్రాథమిక కీలు ఇప్పటికే విడుదలయ్యాయి. ప్రాథమిక కీ లను వెబ్ సైట్ లో ఉంచారు. రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాలను కూడా విడుదల చేశారు. వీటిని https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇక కీలకమైన ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష ప్రాథమిక 'కీ' లు కూడా జెఎన్టీయూ(JNTU) వెబ్ సైట్లో ఉన్నాయి.రెస్పాన్స్ షీట్లను కూడా అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీలపై అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఈ గడువు కూడా పూర్తి కావటంతో… అతి తక్కువ వ్యవధిరలోనే తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు 2024 విడుదల అవుతున్నాయి.

Also read: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురి మృతి..మరో ఇద్దరి పరిస్థితి విషమం!

#telangana #tseapcet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe