Gas Cylinder: ఈ చిన్న చిట్కాతో మీ సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత మిగిలి ఉందో తెలుసుకోవచ్చు.. ట్రై చేయండి!

సిలిండర్‌లోని గ్యాస్ అకస్మాత్తుగా అయిపోతే చాలా ఇబ్బంది. కర్రీ సగమే ఉడుకుతుంది. ఇక ఇంట్లో రిజర్వ్ సిలిండర్ లేకపోతే సమస్య మరింత పెరుగుతుంది. అయితే సిలిండర్‌లో ఎంత గ్యాస్‌ మిగిలి ఉందో తెలుసుకునేందుకు ఒక చిట్కా ఉంది. అదేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Gas Cylinder: ఈ చిన్న చిట్కాతో మీ సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత మిగిలి ఉందో తెలుసుకోవచ్చు.. ట్రై చేయండి!

దేశంలో మెజారిటీ ప్రజలు వంట కోసం ఉపయోగించేది గ్యాస్‌ సిలిండరే. కొన్నిసార్లు యమ్మి టేస్ట్‌ వచ్చేలా చికెన్‌ కర్రి చేస్తుంటే గ్యాస్‌ ఫసక్‌మని అయిపోతుంది. అప్పుడు ఆ బాధ తట్టుకోలేనిది. బాగా తిందామని హ్యాపీగా చికెన్‌ ప్లాన్‌ చేసినప్పుడే ఇలా జరగడం చాలా బాధాకరం. ఇంకొన్ని సార్లు ఇంట్లో అమ్మ లంచ్‌ బాక్స్‌ కోసం ఫుడ్‌ ప్రిపేర్‌ చేస్తుంటే గ్యాస్‌ అయిపోతుంది. ఇది స్కూల్‌కు వెళ్లడాన్ని లేట్‌ చేస్తుంది. స్కూల్‌లో ప్రిన్సిపల్‌ గ్యాస్‌ అయిపోయిందని..అందుకే లేట్ అయిందని చెప్పినా నమ్మకపోవచ్చు. మీక్కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయా? అయితే కంగారు పడకండి. సిలిండర్‌లో గ్యాస్‌ ఎంతుందో తెలుసుకోవచ్చు. ఇదేంటి బండ లోపల గ్యాస్‌ ఎలా కనిపిస్తుంది అని ఆలోచిస్తున్నారా? ప్రతీదానికి ఒక ట్రిక్‌ ఉంటుంది. ఆ ట్రిక్కులు, చిట్కాలు తెలుసుకుంటే ఎంతటి కష్టమైన చిక్కుముడైనా వీడుతుంది. ఈ రోజు మేము మీకు చెప్పబోయే విషయం మీకు చాలా యూజ్ అవుతుంది. సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో తెలుసుకునే ప్రత్యేక పద్ధతి గురించి చెప్పబోతున్నాం. ఈ చిట్కాతో మీ LPG సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో మీరు తెలుసుకోవచ్చు!

తడి గుడ్డ చాలు:
సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో తెలుసుకునేందుకు పెద్ద పెద్ద గ్యాస్‌ డిటెక్టర్లు అవసరం లేదు. ఓ తడి గుడ్డ చాలు. అవును.. మీరు తడి గుడ్డ సహాయంతో గ్యాస్‌ మీ LPG సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో తెలుసుకోవచ్చు. ముందుగా తడి గుడ్డ తీసుకుని సిలిండర్‌ను కప్పి ఉంచాలి. కొన్ని నిమిషాల తర్వాత మీరు సిలిండర్‌పై నుంచి తడి గుడ్డను తీసివేయాలి. ఈ సమయానికి సిలిండర్‌లోని చాలా తేమ తడి గుడ్డ ద్వారా గ్రహించబడుతుంది. కొంత సమయం తరువాత, సిలిండర్‌లో ఎక్కడైతే ఎంప్టీ ఉందో ఆ భాగంలో తేమ నీరు ఎండిపోతుంది. సిలిండర్‌లో ఏ భాగంలో తేమ కనిపిస్తుందో అక్కడ గ్యాస్ ఉన్నట్టు లెక్కా. గ్యాస్‌ ఉన్న ప్రాంతంలో నీరు ఆరిపోవడానికి మరికొంత సమయం పడుతుంది.

గ్యాస్ మంటను పెంచడం లేదా తగ్గించడం మరొక మార్గం. ఇది మునుపటి కంటే తక్కువగా కనిపిస్తే, గ్యాస్ అయిపోతుందని అర్థం. మంట రంగు పసుపు రంగులోకి మారినప్పుడు, సిలిండర్లోని గ్యాస్ అయిపోతుందని భావించవచ్చు.

Also Read: డీఎంకేకు అత్యధిక విరాళాలు ఇచ్చింది ఫ్యూచర్ గేమింగ్ సంస్థే

Advertisment
తాజా కథనాలు