మొబైల్ కు ఛార్జింగ్ ఇలా పెట్టి బ్యాటరీ లైఫ్ టైం కాపాడుకోండి!

మీ స్మార్ట్‌ఫోన్ ను ఛార్జ్ చేయడానికి కంపెనీ ఛార్జర్‌నే వినియోగించమని నిపుణులు చెబుతున్నారు.ఛార్జ్ చేసే సమయంలో దాన్ని స్విచ్ ఆఫ్ లేదా ఎయిర్‌ ప్లేన్ మోడ్‌లో పెట్టడం ద్వారా బ్యాటరీ లైఫ్ టైం పెరుగుతుందని వారు సూచిస్తున్నారు.మొబైల్ జీరో వచ్చే కన్నా 20లో ఉన్నపుడు పెట్టడం మంచిదని వారంటున్నారు.

మొబైల్ కు ఛార్జింగ్ ఇలా పెట్టి బ్యాటరీ లైఫ్ టైం కాపాడుకోండి!
New Update

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది.అయితే నేడు చాలా మంది తమ జీవితాలకు వారి ఫోన్‌లపై ఆధారపడుతున్నారు. అయితే ఫోన్ సరిగ్గా ఛార్జింగ్ పెట్టకపోతే ఫోన్ లైఫ్ తగ్గిపోతుంది.ఎల్లప్పుడూ మీ స్మార్ట్‌ఫోన్ ను ఛార్జ్ చేయడానికి కంపెనీ ఛార్జర్‌ని మాత్రమే ఉపయోగించండి. ఇతర మొబైల్ ఛార్జర్లను ఉపయోగించవద్దు.అత్యవసరమైతే తప్ప ఫాస్ట్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్‌ని ఉపయోగించవద్దు. సాధారణంగా ఫోన్ ను ఛార్జ్ చేసే సమయంలో దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉంచడం కానీ, లేదా ఎయిర్‌ ప్లేన్ మోడ్‌లో కానీ ఉంచడం కానీ చేయండి.

మీ మొబైల్ బ్యాటరీ పూర్తిగా జీరో అయ్యే వరకు యూజ్ చేయకండి. దీని వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గడమే కాకుండా, ప్రమాదకర రేడియేషన్ ఎక్కువగా ఉద్గారం చెందుతుంది.ఫోన్ బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 20 శాతం ఛార్జ్ ఉన్నప్పుడు ఫోన్‌ను ఛార్జ్ చేయడం. ఆ తర్వాత, అది 80 నుండి 90 శాతానికి చేరుకునే వరకు ఛార్జ్ చేసి, ఆపై దాన్ని డిస్‌కనెక్ట్ చేయండి.ఎందుకంటే 0 శాతం నుండి ఛార్జింగ్ చేసినప్పుడు బ్యాటరీ చాలా వేడిగా ఉంటుంది. 80 శాతానికి మించి చార్జింగ్ పెడితే ఫోన్ బ్యాటరీ పనితీరు తగ్గే అవకాశం ఉంది.

మొబైల్ ఫోన్ బ్యాటరీలు దెబ్బతినకుండా ఉండటానికి చల్లని, పొడి ప్రదేశంలో ఉంచాలి.అయితే కొన్ని ఫోన్లలో బ్యాటరీ ఓవర్ ఛార్జింగ్ పెద్దగా ప్రమాదం కాదని అంటున్నారు. ఎందుకంటే కొన్ని ఫోన్‌లలో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఛార్జింగ్‌ని ఆటోమేటిక్‌గా నిలిపివేసే ఫీచర్లు ఉంటాయి.

#phone #battery
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe