భారతీయులకు ఆధార్ కార్డ్ ఉండడం తప్పనిసరి. ఇది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. మీరు ఏ పనిని పూర్తి చేయాలనుకున్నా ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అవసరం. బ్యాంక్ సంబంధిత పని అయినా ఇంకా ఏదైనా వర్క్ అయినా మీ గుర్తింపును చూపించేది ఆధార్ కార్డే. ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర పథకంలో చేరడం లేదా సబ్సిడీ తీసుకోవడం, KYC పూర్తి చేయడం మొదలైన వాటికి కూడా ఆధార్ తప్పనిసరి. ఆధార్ కార్డ్‌లో కార్డ్ హోల్డర్ బయోమెట్రిక్‌తో పాటు డెమోగ్రాఫిక్ సమాచారం ఉంటుంది. మరోవైపు ఆధార్‌లో ఫొటోలు పాతవి ఉంటే మార్చుకుంటే బెటర్. ఆధార్‌లో పాత ఫొటోను మార్చాడానికి ఏం చేయాలో ఇవాళ మేం చెప్పబోతున్నాం.
స్టెప్ 1:
--> మీరు ముందుగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. అక్కడ దిద్దుబాటు ఫారమ్‌ను తీసుకోవాలి. పేరు, ఆధార్ నంబర్, మీరు ఏం మార్పు కావాలని అనుకుంటున్నారో సమాచారాన్ని ఇవ్వాలి.
స్టెప్ 2:
--> ఫారమ్‌ను సరిగ్గా పూరించండి. ఈ ఫారమ్‌ను ఆధార్ కేంద్రంలో ఉన్న సంబంధిత అధికారికి సమర్పించాలి.
స్టెప్ 3:
--> మీరు సంబంధిత అధికారికి ఫారమ్ ఇచ్చిన వెంటనే..ఆ అధికారి మొదట సిస్టమ్‌లో మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేస్తారు. మీ సమాచారాన్ని చెక్ చేస్తారు. ప్రతిదీ సరైనదిగా నిర్ధారించుకున్న తర్వాత మీ బయోమెట్రిక్‌ను తీసుకుంటారు. ఆ తర్వాత మీ తాజా ఫొటో క్లిక్ చేస్తారు.
స్టెప్ 4:
--> ఇది జరిగిన తర్వాత మీకు ఒక స్లిప్ ఇస్తారు. అందులో మీరు ఫొటో అప్‌డేట్ చేసుకున్నారనే సమాచారంతో పాటు రిఫరెన్స్ నంబర్ ఉంటుంది.
--> మీరు ఈ నంబర్ ద్వారా మీ ఫొటో అప్‌డేట్ స్టెటస్ చెక్ చేసుకోవచ్చు.
--> మీ కొత్త ఫోటో కొన్ని రోజుల్లో అప్‌డేట్ అవుతుంది.
Also Read: 4 నెలల మనవడికి రూ.240 కోట్లు.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు సంచలనం!