Tattoo: పచ్చబొట్టు వేయించుకుంటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి

అనుభవజ్ఞుల దగ్గర టాటూస్‌ వేసుకోకపోతే ఇన్‌ఫెక్షన్లతో పాటు ప్రాణాంతకం అవుతుందని నిపుణులు అంటున్నారు. టాటూస్‌ కోసం వాడే పరికరాలను ముందుగానే సరిచూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. సరైన క్రీములు వాడకపోతే అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.

Tattoo: పచ్చబొట్టు వేయించుకుంటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి
New Update

Tattoo: ఈ రోజుల్లో చిన్నాపెద్దా అందరూ టాటూస్‌ని వేయించుకుంటున్నారు. స్టైలీష్‌గా కనిపించేందుకు ఎక్కడపడితే అక్కడ పచ్చబొట్లు వేయించుకుంటున్నారు. చేతులపై, ముఖాలపై పచ్చబొట్లు వేయించుకోవడం సహజమే. కానీ కొందరైతే ఏకంగా ఒళ్లంతా పచ్చబొట్లు వేయించుకుని తిరుగుతుంటారు. మన దేశంలో ఒకప్పుడు పసరులో ముంచి సూదులతో గుచ్చి పచ్చబొట్లు వేసేవారు. అది కూడా ఎవరైనా ఎవరిపైన అయినా మమకారం ఎక్కువ ఉంటే వారి పేర్లను చేతిపై పచ్చబొట్టు వేయించుకునేవారు. కానీ ఈ రోజుల్లో యువత మొత్తం రకరకాల డిజైన్లు, బొమ్మలును వంటినిండా టాటూస్ లాగా వేయించుకుంటున్నారు. ఈ టాటూస్ లో రెండు రకాలు ఉంటాయి. కొన్ని పర్మినెంట్, మరికొన్ని తాత్కాలికం.. ఈ తాత్కాలిక టాటూస్ కొన్ని రోజులు లేదా కొన్ని నెలలకు చెరిగిపోతుంటాయి. కానీ పర్మినెంట్ టాటూస్ మాత్రం అలాగే ఉంటాయి.

టాటూస్‌ని తొలగించవచ్చా?:

వాటిని తీసేయడం కూడా అంత తేలికైన పని కాదు. ఇప్పుడు మాత్రం టాటూస్ ని తొలగించడానికి లేజర్ ట్రీట్మెంట్లు అందుబాటుకి వచ్చాయి. అది కూడా ఖర్చుతో కూడుకున్న పని.

టాటూస్‌ వేయించుకునేటప్పుడు జాగ్రత్తలు:

టాటూ వేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. టాటూ వేయించుకోవాలనుకుంటే వేసుకునే ముందు ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మీరు టాటూ డిజైన్ వేయించుకోవాలనుకుంటే లైసెన్స్ ఉన్న, అనుభవజ్ఞుడైన టాటూ ఆర్టిస్ట్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అనుభవం లేని వారు లేదా లైసెన్స్ లేని వారు తక్కువ డబ్బుతో పచ్చబొట్టు వేస్తారు. వారి దగ్గర వేయించుకోవడం వల్ల అనేక ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది.

ఎలాంటి ముందు జాగ్రత్తలు అవసరం?:

టాటూ వేయడానికి ముందు టాటూ ఆర్టిస్ట్ తాజా సూదిని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. టాటూ ఆర్టిస్ట్ సరైన పరికరాలను ఉపయోగిస్తున్నారో లేదో తనిఖీ చేయండి. టాటూ వేసుకునేటప్పుడు అతను చేతికి గ్లౌసులు వేసుకున్నాడో లేదో చెక్‌ చేయండి. ఒకవేళ వాళ్లు వేసుకోకపోతే మీరే గుర్తుచేయండి. పచ్చబొట్టు వేసే పరికరాలు స్టెరిలైజ్‌ చేశారో లేదో చూసుకోండి. టాటూ వేయించుకున్న తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి పూయాల్సిన క్రీమ్‌ల గురించి తెలుసుకోండి. లేకపోతే అలెర్జీలు లేదా ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: టీవీ చూస్తూ నిద్రపోయే అలవాటు ప్రమాదమా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

#tattoo-care #tattoo
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe