Union Budget 2024 : బడ్జెట్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? త్వరలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అసలు బడ్జెట్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? మన రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదు. దీనిని వార్షిక ఆర్ధిక ప్రకటన అని పిలుస్తారు. బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ పదం బౌగెట్ బౌజ్ నుండి వచ్చింది. అంటే, లెదర్ బ్రీఫ్‌కేస్ అని అర్ధం. By KVD Varma 19 Jul 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Parliament : కేంద్ర సాధారణ బడ్జెట్ ఈనెల 23న పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్ లెక్కలు పూర్తి చేశారు. తాజాగా జరిపిన హల్వా వేడుకతో బడ్జెట్ పేపర్స్ ప్రింటింగ్ కార్యక్రమం మొదలైంది. బడ్జెట్ పనిలో ఉన్న అధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాంగణంలో కట్టుదిట్టమైన నిఘాలో ఉన్నారు. వీరు బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తరువాత బయటకు వస్తారు. బడ్జెట్ కు సంబంధించిన ఎటువంటి విషయాలు లీక్ కాకుండా ఉండేందుకు ఇలాంటి ఏర్పాటు చేశారు. Union Budget 2024 : కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం లోక్‌సభ (Lok Sabha) లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. కానీ రాజ్యాంగంలో ఒక్కసారి కూడా బడ్జెట్ అనే పేరును ప్రస్తావించలేదు. సరిగ్గా చెప్పాలంటే.. బడ్జెట్ అనే పదమే మన రాజ్యంగంలో లేదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. మరి బడ్జెట్ ప్రస్తావన లేకుండా పార్లమెంట్ లో బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారు? అనే డౌట్ మీకు రావచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో దీనిని 'వార్షిక ఆర్థిక ప్రకటన' అని పిలుస్తారు. ఈ ప్రకటనలో, ప్రభుత్వం మొత్తం సంవత్సరానికి దాని అంచనా వ్యయం - రాబడి వివరాలను అందిస్తుంది. దీనినే మనం బడ్జెట్ అని చెప్పుకుంటున్నాం. అసలు బడ్జెట్ అనే పదం అర్ధం ఏమిటి? దీని వెనుక కథ ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బడ్జెట్ అనే ఆంగ్ల పదానికి పరిపాలన ఆర్థిక స్థితి అని అర్థం. ఇది ఒక ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. అసలు ఆ ఫ్రెంచ్ పదం వేరే. బడ్జెట్ అనేది ఫ్రెంచ్ పదం బౌగెట్ నుండి ఉద్భవించింది. బౌగెట్ బౌజ్ అంటే లెదర్ బ్రీఫ్‌కేస్ అని అర్ధం. మన బడ్జెట్ స్టోరీ.. Union Budget 2024 భారత బడ్జెట్ చరిత్ర 160 ఏళ్లకు పైగా ఉంది. 1857 విప్లవం తరువాత, బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి భారతదేశ పరిపాలనను చేపట్టింది. ఆ తర్వాత 1860లో భారత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈస్టిండియా కంపెనీకి చెందిన జేమ్స్ విల్సన్ దీనిని బ్రిటిష్ రాణికి సమర్పించారు. యాదృచ్ఛికంగా, అదే సంవత్సరంలో, బ్రిటన్‌లో లెదర్ బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్‌ను తీసుకువచ్చే సంప్రదాయం ప్రారంభమైంది. 1860లో, బ్రిటన్ ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్ చీఫ్ విలియం ఎవార్ట్ గ్లాడ్‌స్టోన్ బడ్జెట్ పేపర్‌లను లెదర్ బ్యాగ్‌లో తీసుకొచ్చాడు. బ్యాగ్‌లో బ్రిటిష్ రాణి మోనోగ్రామ్ ఉంది. దానికి గ్లాడ్‌స్టోన్ బాక్స్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి బడ్జెట్‌ను బ్రీఫ్‌కేస్‌లో ఉంచే సంప్రదాయం మొదలైంది. బ్రీఫ్‌కేస్ లెడ్జర్‌గా .. స్వతంత్ర భారతదేశపు తొలి బడ్జెట్‌ను షణ్ముఖం శెట్టి లెదర్ బ్యాగ్‌లో సమర్పించారు. 1958లో తొలిసారిగా భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ బడ్జెట్‌లో ఎరుపు రంగు బ్రీఫ్‌కేస్‌కు బదులుగా నల్లటి బ్రీఫ్‌కేస్‌ను ఉపయోగించారని చెబుతారు. తర్వాత నల్ల బ్యాగ్‌ని ఎంచుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ ఎరుపు రంగు బ్రీఫ్‌కేస్‌తో వచ్చారు. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గోధుమ, ఎరుపు రంగు బ్రీఫ్‌కేస్‌తో వచ్చారు. తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఎరుపు రంగు బ్రీఫ్‌కేస్‌తో బడ్జెట్‌ను సమర్పించారు. మోదీ ప్రభుత్వం (Modi Government) రెండోసారి అధికారంలోకి వచ్చిన మొదటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంప్రదాయానికి దూరంగా ఉన్నారు. బ్రీఫ్ కేస్ బదులు ఎర్రటి గుడ్డ చుట్టి బడ్జెట్ తీసుకొచ్చారు ఆమె. పాశ్చాత్య మనస్తత్వానికి బానిసత్వం నుండి బయటపడటానికి ఇది ప్రతీక అని అప్పటి ప్రధాన ఆర్థిక సలహాదారు కె సుబ్రమణియన్ అన్నారు. 2021లో ఆర్థిక మంత్రి సీతారామన్ (Nirmala Sitharaman) మరో పెద్ద మార్పు చేశారు. ఆ సంవత్సరం ఆమె తన ప్రసంగం - ఇతర బడ్జెట్ పత్రాలను తీసుకువెళ్లడానికి సంప్రదాయ పేపర్ బదులుగా డిజిటల్ టాబ్లెట్‌ను వాడటం మొదలు పెట్టారు. ఫిబ్రవరి 2024లో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించేందుకు కూడా ఆమె ఈ పద్ధతినే ఎంచుకున్నారు. Also Read : ‘మైక్రోసాఫ్ట్’ క్రాష్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన బ్యాంకింగ్, విమాన సేవలు! #parliament #union-budget-2024 #nirmala-sitharaman మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి