Marriage Life: కొత్త పెళ్లి కూతుర్లూ.. ఇది మీ కోసమే.. అత్తమామలను ఫ్లాట్‌ చేసే చిట్కాలు!

ప్రతీ అత్తగారు తన కోడలులో సమర్థవంతమైన గృహిణి లక్షణాలను కోరుకుంటారు. ముఖ్యంగా రుచికరమైన వంట చేయడం ఎలాగో తెలుసుకోవాలి. సందర్భాన్ని బట్టి దుస్తులు ధరించాలి. ఇక అత్తమామల దగ్గర ఎలా మార్కులు కొట్టాలో తెలుసుకోవాడానికి ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Marriage Life: కొత్త పెళ్లి కూతుర్లూ.. ఇది మీ కోసమే.. అత్తమామలను ఫ్లాట్‌ చేసే చిట్కాలు!

Marriage Life: భారతదేశంలో వివాహం అనేది కేవలం భార్యాభర్తల మధ్య సంబంధం కాదు, కుటుంబాల సంబంధం. పెళ్లి తర్వాత అమ్మాయికి ఒకటి కాదు రెండు కుటుంబాలు ఉంటాయి. ఒకటి ఆమె జన్మించిన కుటుంబం, మరొకటి ఆమె భర్త జన్మించిన కుటుంబం. పెళ్లి తర్వాత భర్త కుటుంబంతోనే ఎక్కువమంది కాలం గడుపుతారు. అత్త, మామలు ఉన్న చోట అమ్మాయి ఉండాల్సి వస్తుంది. ఇక అత్తమామలతో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మంచి బంధం అవసరం. ప్రతి అమ్మాయి తన ఇంట్లో గౌరవం, ప్రేమ లభించినట్లే అత్తమామల్లో కూడా లభిస్తుందని ఆశిస్తుంది. అయితే ఇది జరగాలంటే అత్తమామలకు మీ మనసు గురించి తెలియాలి.

అందమైన బట్టలు:

  • పెళ్లి తర్వాత కొత్త వధువును చూసేందుకు అతిథులు వస్తూనే ఉంటారు. మీరు వారందరితో మంచిగా, మర్యాదగా మాట్లాడితే అతిథులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. కోడలు పొగడ్తలు వింటే అత్తమామలు గర్వపడతారు. సందర్భాన్ని బట్టి దుస్తులు ధరించాలి. పెద్దగా అలంకరించాల్సిన అవసరం లేదు కానీ తేలికపాటి మేకప్, అందమైన బట్టలతో అలంకరించుకోవచ్చు. అత్తగారిని ఇంప్రెస్ చేయాలంటే ఆమె స్నేహితులను, బంధువులను ఇంప్రెస్ చేయడం అవసరం. అయితే ఇంప్రెస్‌ చేయడమే మీ పని కాదని గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ చంపుకోని ఎవరిని ఇంప్రెస్‌ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా పరిధిలోనే ఉండాలి.ఇంట్లో పిల్లలుంటే అల్లరి, సందడి తప్పదు. అయితే వారి చేష్టలకు మీరు చిరాకు పడకూడదు. ప్రశాంతంగా ఉండి పిల్లలకు ప్రేమగా ఏదైనా వివరించండి. ప్రతి ఒక్కరూ పిల్లలను ప్రేమిస్తారు. ఇంటి పిల్లలతో స్నేహం చేస్తే పెద్దల గుండెల్లో కూడా స్థానం ఉంటుంది.

అత్తగారితో స్నేహం:

  • మీరు ఉద్యోగం చేసినా చేయకున్నా ప్రతి అత్తగారు తన కోడలులో సమర్థవంతమైన గృహిణి లక్షణాలను కోరుకుంటారు. కోడలు వంటగది పనిలో నైపుణ్యం కలిగి ఉంటే, ముఖ్యంగా రుచికరమైన వంట చేయడం ఎలాగో తెలుసుకుంటే, ఆమె అత్తమామలు చాలా త్వరగా ఆకట్టుకుంటారు. అయితే ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి వంట అద్భుతంగా రావాలని ఉండదు. ఒకవేళ మీకుకూడా వంట మంచిగా రాకపోతే ఆ విషయాన్ని అత్తమామలు అర్థం చేసుకోవాలి. ఇంక ఇంటి పనుల్లో అత్త కూడా సాయం చేయాల్సి ఉంటుంది. అటు భర్త సైతం మాగాడన్న అహంకారం లేకుండా ఇంట, వంట పనుల్లో సాయంగా ఉండాలి. మీ అత్తగారితో స్నేహం చేయండి. ఆమెను బయటకు తీసుకెళ్లండి. షాపింగ్‌కి వెళ్లండి. మరింత నాణ్యమైన సమయాన్ని గడపండి. మీ అత్తమామలతో మీకు మంచి అనుబంధం ఉంటే, మిగిలిన కుటుంబ సభ్యులు కూడా మీతో మంచిగా ఉంటారు.

ఇది కూడా చదవండి: అరటి పువ్వుతో అరడజను భయంకరమైన రోగాలు మాయం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు