Space:అందరికీ వెన్నెలలు పంచే చంద్రుడు ఎలా పుట్టాడో తెలుసా..

చందమామ అందిన రోజు... అంటూ పాట పాడేసుకున్నాం.చందమామను అందేసుకున్నాం, కానీ ఇప్పటివరకు చంద్రుడు ఎలా వచ్చాడో ఎవరికీ తెలియదు. దీని మీద చాలా పరిశోధనలు వెలువడ్డాయి. ఇప్పుడు తాజాగా జాబిల్లి పుట్టుక మీద మరో పరిశోధన వెలువడింది.

Space:అందరికీ వెన్నెలలు పంచే చంద్రుడు ఎలా పుట్టాడో తెలుసా..
New Update

చంద్రుడు భూమి నుంచి 3 లక్షల 84 వేల 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చందమామ మనిషిని అందుకునేంత టెక్నాలజీ వచ్చేసినా చందమామ పుట్టుక మాత్రం ఇప్పటికీ మిస్టరీగా ఉంది. అయితే ఇప్పడు బ్రిటన్ లోని డార్హం యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చంద్రుని పుట్టుక గురించి కొత్త థియరీ చెబుతున్నారు. చందమామ భూమి నుంచి ఊడిపడింది అంటూ.దీని మీద ఒక కొత్త సిద్ధాంతాన్ని కూడా అభివృద్ధి చేశారంట.

Also Read:అనంతపురంలో బస్ బ్రేక్ ఫెయిల్..ఒకరు మృతి

450 కోట్ల ఏళ్ళ క్రితం భూమి, థియా అని పిలిచే మార్స్ లాంటి గ్రహం రెండూ గుద్దుకున్నాయిట.అప్పడు థియా ముక్కలైందిట. ఆముక్కల్లో 80 శాతం భూమిలో కలిసిపోయాయి కానీ 20 శాతం మాత్రం దూరంగా అంతరిక్షంలో ఉండిపోయాయి. అలా కలవకుండా ఉండిపోయిన భాగమే మూన్ అంటున్నారు ఈ శాస్త్రవేత్తలు. దీన్నిబట్టి చంద్రుడు ఏర్పడడానికి శతాబ్దాలు కాదు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే పట్టిందని చెబుతున్నారు.

దీంతో పాటూ మరో విషయం కూడా కనుగొన్నామని అంటున్నారు. 2016లో భూమికి దగ్గరగా కామో ఓవాలెవా అనే గ్రహశకలాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇది భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఉందని తప్పితే మరే వివరాలు తెలియలేదు. అయితే ఇప్పడు దీని పుట్టుక గురించి తెలిసింది అంటున్నారు. కామో ఓవాలెవా... చంద్రుని నుంచి ఊడి పడ్డ ఒక భాగం కావచ్చు అని అంటున్నారు. ఇంకా పూర్తిగా పరిశోధనలు చేసి నిర్ధారిస్తామని చెబుతున్నారు.

అంతరిక్షమే ఒక మాయాజాలం అంటే అందులో మరెన్నో వింతలు, మాయలు బయటపడుతున్నాయి. రోజుకో కొత్త విషయం కనిపెడుతున్నారు శాస్త్రవేత్తలు. చివరకు ఏది ఫైనల్ చేస్తారో తెలియదు కానీ ఈ శాస్త్రవేత్తలు చెప్పే సంగతులు మాత్రం భలే వింతగా, కొత్తగా అనిపిస్తున్నాయి కదండీ. ఎంతైనా మనకు తెలియని వింత లోకం గురించి తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరమే కదా.

#moon #space #astronomy #birth
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి