Greater Hyderabad:గ్రేటర్ హైదరాబాద్ లో ఎంత మంది ఓటర్లున్నారంటే!!

హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొత్తం 3986 పోలింగ్ ష్టేషన్లు ఉన్నాయి. మొత్తం 43 లక్షల 989 మంది ఓటర్లున్నట్టు ఎన్నికల విభాగం డ్రాఫ్ట్ లో వెల్లడించింది. ఇందులో 20 లక్షల 90 వేల 727 మంది మహిళలున్నారు. 22 లక్షల 9 వేల 972 మంది పురుషులున్నారు. ఇక అన్ని నియోజక వర్గాల్లో కలిపి 290 థర్డ్ జండర్ ఓట్లున్నాయి.

New Update
Greater Hyderabad:గ్రేటర్ హైదరాబాద్ లో ఎంత మంది ఓటర్లున్నారంటే!!

Greater Hyderabad Voters List: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఓ వైపు అధికార ప్రతిపక్షాలు తమ తమ గెలుపు గుర్రాలు బరిలోకి దింపుతుంటే.. మరోవైపు అభ్యర్థుల అదృష్టాలను డిసైడ్ చేసే ఓటర్ల లిస్ట్ ను ఎన్నికల సంఘం (Election Commission) ఫైనల్ చేసే పనిలో దూసుకెళుతోంది. ఓటరు జాబితాలో సవరణ ప్రక్రియను చేపట్టిన ఎన్నికల వింగ్ తాజాగా ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేసింది. మరి దీని ప్రకారంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 15 అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఎంత మంది ఓటర్లున్నారు..అందులో పురుషులు ఎంత మంది.. మహిళలు ఎంత మందో తెలుసా..!

ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే..!

హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొత్తం 3986 పోలింగ్ ష్టేషన్లు ఉన్నాయి. మొత్తం 43 లక్షల 989 మంది ఓటర్లున్నట్టు ఎన్నికల విభాగం డ్రాఫ్ట్ లో వెల్లడించింది. ఇందులో 20 లక్షల 90 వేల 727 మంది మహిళలున్నారు. 22 లక్షల 9 వేల 972 మంది పురుషులున్నారు. ఇక అన్ని నియోజక వర్గాల్లో కలిపి 290 థర్డ్ జండర్ ఓట్లున్నాయి.

అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం ఇదే..!

హైదరాబాద్ మహానగరంలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో జూబ్లిహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లున్నారు. ఈ ఒక్క నియోజక వర్గంలోనే 3 లక్షల 56 వేల 995 మంది ఓటర్లున్నారు. అయితే ఇందులో నుంచి చాలా వరకు విఐపీ, వివిఐపీ ఓట్లే ఉన్నాయి. ఇక అత్యల్పంగా ఓటర్లున్న నియోజక వర్గం చార్మినార్. ఇక్కడ 2 లక్షల 16 వేల 648 మంది ఓటర్లున్నారని ఎన్నిలక విభాగం డ్రాఫ్ట్ లో పేర్కొంది.

ఏయే నియోజక వర్గంలో ఎంత మంది ఓటర్లు..!

ముషీరాబాద్లో 2,87,195, మలక్ పేట్లో3,04,856, అంబర్ పేట్ లో 2,58,704, ఖైరతాబాద్ (khairatabad) లో 2,82,080, జూబ్లిహిల్స్ లో 3,56,995, సనత్ నగర్ లో 2,35,702, నాంపల్లి (Nampally)లో 3,12,477, కార్వాన్ 3,42,414,గోషామహల్ 2,59,544, చార్మినార్ 2,16,648, చాంద్రాయణ గుట్ట 3,21,227, యాకుత్ పురా 3,34,886, బహదూర్ పురా 2,97,498, సికింద్రాబాద్ 2,50,234, కంటోన్మెంట్ 2,40,529 ఓటర్లున్నారు. ఇక వచ్చే నెల 19 వరకు హైదరాబాద్ లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదాపై క్లెయిమ్ లు, అభ్యంతరాలను ఎలక్షన్ ఆఫ్ ఇండియా వైబ్ సైట్ లో స్వీకరించబడుతాయి.

Also Read: సికింద్రాబాద్‌లో దారుణం.. బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్

Advertisment
తాజా కథనాలు