Unbottling the Truth: అర్చన అప్పటివరకు ఫ్రెండ్స్‌తో ఆడి పాడింది. గ్రౌండ్‌లో పరుగులు తీసింది. ఇంతలోనే బాగా దాహం వేసింది. బ్యాగ్ చూస్తే వాటర్ బాటిల్ ఖాళీగా కనిపించింది. ఫ్రెండ్స్ దగ్గర కూడా వాటర్ లేవు. దీంతో గేమ్ ఆపేసి ఇంటికి బయలుదేరింది. డీహైడ్రెషన్ పెరుగుతున్నట్టు అనిపించడంతో దారిలోని ఓ షాప్‌లో 20 రూపాయలు ఇచ్చి ప్లాస్టిక్ బాటిల్ కొనుగోలు చేసింది. ఆ వాటర్ తాగుతూ ఇంటికెళ్లింది. చేతిలో వాటర్ బాటిల్‌తో నీళ్లు తాగుతూ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వెంటనే అర్చన వాళ్ల అమ్మ కంగారు పడింది. ఉదయమే టీవీలో చూసిన న్యూస్ గుర్తించింది. 'ఎంత పని చేశావే...' అని అర్చనను చూస్తు బాధపడింది. అర్చనకు ఏమీ అర్థంకాలేదు.. 'నేనేం చేశానమ్మ' అని అమాయకంగా అడిగింది. 'ఆ వాటర్ బాటిల్ పడై ముందు' అని అమ్మ సమాధానం ఇచ్చింది. మమ్మీ ఏదో పిచ్చి సీరియల్ చూసి ఏదో వాగుతుందని భావించిన అర్చన.. ఆ వాటర్‌ని పడేసి అసలు విషయం చెప్పమని అడిగింది. వాటర్ బాటిల్‌లో 2లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని అమ్మ చెప్పడంతో అర్చన కంగుతిన్నది. వెంటనే న్యూస్ కోసం నెట్ ఆన్ చేసి గూగుల్‌లో అసలు విషయాన్ని తెలుసుకుంది.
సైంటిస్టుల షాకింగ్ పరిశోధన:
ఒక లీటరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్(Plastic Water Bottle)లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయట. కొలంబియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ రీసెర్చ్ చేశారు. అమెరికాలో విక్రయిస్తున్న మూడు ప్రముఖ బ్రాండ్‌ల బాటిల్ వాటర్‌ను విశ్లేషించారు. 100 నానోమీటర్ల పరిమాణంలో ప్లాస్టిక్ కణాలను కొలుస్తారు. ప్రతి లీటరు వాటర్ బాటిల్‌లో దాదాపు 1.1-3.7 లక్షల ప్లాస్టిక్ శకలాలను గుర్తించారు. ఇందులో 90 శాతం నానోప్లాస్టిక్‌లు, మిగిలినవి మైక్రోప్లాస్టిక్‌లు. నానోప్లాస్టిక్‌లు మైక్రోమీటర్ కంటే చిన్నవి. వారి పరిశోధనలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు. ఇటీవలి సంవత్సరాలలో, మైక్రోప్లాస్టిక్‌లు నేల, తాగునీరు, ఆహారం, ధ్రువ మంచులో కూడా ఉన్నట్లు గుర్తించారు. పెద్ద ప్లాస్టిక్‌లు క్రమంగా చిన్న బిట్‌లుగా విడిపోయినప్పుడు ఏర్పడిన ఈ ప్లాస్టిక్‌లు వాటి ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థపై సంభావ్య ప్రభావాలతో మనుషులతో పాటు ఇతర జీవులలోకి ప్రవేశిస్తాయి. ఇది చాలా ప్రమాదకరం.
వీటితో చాలా డేంజర్:
మైక్రోప్లాస్టిక్ లాగా కాకుండా.. నానోప్లాస్టిక్‌లు జీర్ణ, శ్వాసకోశ వ్యవస్థలను దాటి రక్తప్రవాహంలోకి ప్రవేశించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మకణాలు గుండె కండరాల లాంటి ముఖ్యమైన అవయవాలలో పేరుకుపోతాయి. మెదడుకు బ్లడ్ ఫ్లోని కూడా ఆపే అంత హానీ కలుగుతుంది. గర్భిణీలు ఈ నీరు తాగితే పుట్టబోయే శిశువుల శరీరాల్లోకి కూడా ప్లాస్టిక్ రేణువులు చొరబడవచ్చు. వాటర్ బాటిల్స్‌లోని మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. దీని అధిక పరిమాణం హార్మోన్ల అసమతుల్యత, వంధ్యత్వం, కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కువసేపు వాడితే పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
Also Read: నా దేశానికి బెస్ట్ ఇవ్వడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా..మహ్మద్ షమీ
WATCH: