Telling Lies: పదేపదే అబద్ధాలు చెప్పేవారిని ఎలా డీల్ చేయాలి? ఈ టిప్స్ పాటించండి..!

నిజాయితీ లేని వ్యక్తిగా ప్రపంచం మిమ్మల్ని గుర్తించేలాగా చేసుకోవద్దు. అబద్ధాలు అందరూ చెబుతారు.. అయితే అవి ఇతరులకు హాని కలిగించేవిగా ఉండకూడదు. అబద్ధాలు తరుచుగా చెప్పే వ్యక్తితో లిమిట్‌లో ఉండండి. కూల్‌గా ఉండేందుకు ప్రయత్నించండి. పదేపదే అబద్ధాలు చెప్పే వ్యక్తిని "పాథలాజికల్ అబద్ధాలకోరు(pathological liar)" అని పిలుస్తారు.

Telling Lies: పదేపదే అబద్ధాలు చెప్పేవారిని ఎలా డీల్ చేయాలి? ఈ టిప్స్ పాటించండి..!
New Update

What to Know About Pathological Liars: చిన్నపిల్లలే ఎక్కువగా అబద్ధాలు చెబుతారని ఎవరైనా అంటే వారికి బయట ప్రపంచంతో పెద్దగా సంబంధంలేనట్టే భావించవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇతరులకు హాని చేయాలనో.. ఉద్దేశపూర్వకంగానో అబద్ధాలు చెప్పరు.. కానీ కొంతమంది పెద్దవాళ్లు మాత్రం తమ స్వార్థం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టేలా అబద్ధాలు ఆడతారు. అలాంటివారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనం ప్రమాదంలో పడినట్టే లెక్క. అయితే కొన్ని స్ట్రాటజీలు ఉపయోగించి వారి అబద్ధాలను ధీటుగా ఎదుర్కొవచ్చు.

➼ అబద్ధాలకోరుతో వ్యవహరించడం చాలా ఛాలెంజింగ్‌ విషయం.. కానీ ఇక్కడ పరిగణించవలసిన కొన్ని వ్యూహాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

➼ సాక్ష్యాలను సేకరించండి: అబద్ధాల గురించి ఎవరైనా ఎదుర్కొనే ముందు.. మీ వాదనలకు మద్దతు ఇవ్వడానికి సాక్ష్యాలను సేకరించండి. ఇది చాలా ముఖ్యం.. ఎందుకంటే ఫ్రూఫ్స్‌ లేకపోతే ప్రజలు నమ్మే పరిస్థితులో లేరు.

➼ ప్రశాంతంగా ఉండండి: ప్రశాంతంగా, కోపం లేకుండా ఉండండి. భావోద్వేగాలు సమస్యను పరిష్కరించడానికి కష్టతరం చేస్తాయి. ఎంత కూల్‌గా ఉంటే అంత బెస్ట్. ఆవేశపడి నోటికి పని చెప్పవద్దు.

➼ ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయండి: మీ ఆందోళనలు, భావాలను వ్యక్తపరచండి. అయితే ఎలాంటి గొడవకు ప్లేస్ ఇవొద్దు . అసలు సదరు వ్యక్తి ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చిందో అతని ద్వారానే చెప్పించే ప్రయత్నం చేయండి.

➼ లిమిట్‌లో ఉండండి: ఒక వ్యక్తి మీతో పదేపదే అబద్ధాలు చెబుతున్నట్టు ప్రూవ్ అయితే.. అతనితో సంబంధాలను కట్ చేయండి.. ఒకవేళ అతని విస్మరించకుండా ఏ పని జరగదని భావిస్తే వారితో రిలేషన్‌ని లిమిట్ చేయండి.

➼ వారి ప్రేరణలను పరిగణించండి: వ్యక్తి ఎందుకు అబద్ధం చెప్పాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు, ప్రజలు భయం, అభద్రత లేదా తమను తాము రక్షించుకోవాలనే ఆలోచనతో అబద్ధాలు చెబుతారు.

➼ నిజాయితీని ప్రోత్సహించండి: మీరు నిజాయితీని విలువైనదిగా పరిగణిస్తారని, నమ్మకాన్ని పెంపొందించుకోవడానికి అది అవసరమని వ్యక్తికి తెలియజేయండి. నిజాయితీగా ఉంటే ఇతరులు ఎంత విలువ ఇస్తారో సదరు వ్యక్తికి అర్థమయ్యేలా చేయండి. ఆ నిజాయితీనే లేకపోతే అవతల వ్యక్తి ఎంత డబ్బు, హోదా ఉన్న గౌరవం ఉండదని అర్థమయ్యేలా చెప్పండి.

➼ సహాయాన్ని కోరండి: ఇతరులు మీ గురించి పనిగట్టుకోని చెప్పిన అబద్ధాలు మీకు నేరుగా హాని కలిగిస్తున్నట్లయితే మెడికల్ హెల్ప్ తీసుకోండి. లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకునే వారితో ఈ విషయాలను పంచుకోండి.. ఒంటరిగా మాత్రం ఈ అబద్ధాలకోరులని ఫేస్‌ చేయాలేమని తెలుసుకోండి.

ఇలాంటి వారితో డీల్ చేయడం చాలా కష్టం.. అయితే ఎక్కడా కూడా సహనం కోల్పోవద్దు.. మీరు సహనం కోల్పోతే అందరికి మీదే తప్పులాగా కనిపిస్తుంది. అందుకే కూల్‌గా ఉండండి. నిజానికి అందరూ అబద్ధాలు చెబుతారు. అది మానవ లక్షణం. అయితే ఈ అబద్ధాలు లిమిట్ దాటకూడదు..ఇతురలకు హాని చేయకూడదు.

ALSO READ: నిద్ర లేదా ఆహారపు అలవాట్లు మారాయా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే!

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe