House Arrest of TDP Leaders: ఇసుక పాలసీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు ఆందోళనలు.. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు

ఇసుక పాలసీ, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు బుధవారం ఆందోళనలు నిర్వహిస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ ఇసుక, అక్రమ మైనింగ్‌పై తెలుగు దేశం పార్టీ పోరాటం చేస్తోంది.

New Update
House Arrest of TDP Leaders: ఇసుక పాలసీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు ఆందోళనలు.. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు

House Arrest of Leaders due to TDP call for protest against Mining Office over Sand Irregularities: ఇసుక పాలసీ, అక్రమ రవాణకు వ్యతిరేకంగా టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా మూడో రోజు ఆందోళనలు నిర్వహించింది. ఈ క్రమంలో డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి తెలుగు దేశం అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు.. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. వైసీపీ ఇసుక, అక్రమ మైనింగ్‌పై తెలుగు దేశం పార్టీ పోరాటం చేస్తోంది.

గుంటూరులో నక్కా ఆనంద బాబు, ఆలపాటి రాజా హౌస్ అరెస్ట్:

మరోవైపు గుంటూరులో మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు, ఆలపాటి రాజాలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే పలువురు టీడీపీ నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు. బుధవారం టీడీపీ నేతలు మైనింగ్ శాఖ డీడీను కలవనున్నారు. అయితే దీనికి అనుమతి లేదంటూ పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్‌ లు చేసి నోటీసులు జారీ చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన మైనింగ్ ఆఫీస్‌ కు వెళ్లి ఇసుక అక్రమాలపై ఆధారాలు ఇస్తామని తెలుగు దేశం నేతలు స్పష్టం చేశారు.

ఇబ్రహీం పట్నంలో పోలీసులు భారీగా ఉండటంతో.. టీడీపీ నేతలు వ్యూహం మార్చారు. తాడిగడపలోని ఏపీఎండీసీని ముట్టడించారు టీడీపీ నేతలు. ఈ నిరసనలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆశోక్ బాబు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, టీడీపీ నేత కనపర్తి శ్రీనివాస రావు, వేములపల్లి శ్రీనివాస రావు(బుజ్జి), చిట్టాబత్తిన శ్రీనివాసరావు, కృష్ణా పశ్చిమ ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ మైనేని మురళి కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.

అప్పుడు నిందలేసారు.. ఇప్పుడేం చేస్తున్నారు:

తెలుగు దేశం పార్టీ హయాంలో ఉచితంగా అందే ఇసుక పాలసీపై నిందలేసి, నానా యాగీ చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక నూతన ఇసుక పాలసీ పేరుతో రూ.40 వేల కోట్లు దోచుకున్నాడని టీడీపీ ఆరోపిస్తుంది. జేపీ పవర్ వెంచర్స్ సంస్థను తెరముందుకు తెచ్చి తెర వెనుక తన పార్టీ వారితో ఇసుక మొత్తాన్ని హస్తగతం చేసుకున్నాడని టీడీపీ అంటోంది. తన అనుచరులతోనే దగ్గరుండి ఇసుక మాఫియాను నడిపిస్తూ ఖజానా నింపు కుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా టీడీపీ నిరసన కార్యక్రమాలను నిర్వహించింది.

అధికార పార్టీ నాయకులే వెనకుండి అంతా నడిపిస్తున్నారు:

రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ‘ఇసుక సత్యాగ్రహం’ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ కార్యాలయాల్లో, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అక్రమంగా ఇసుక తవ్వుతున్న క్వారీలపై, నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేపీ సంస్థకు ఇచ్చిన టెండర్ గడువు ముగిసిన తర్వాత కూడా అదే కంపెనీ బిల్లులతో ఇసుక అమ్మకాలు చేయడం కుంభకోణమేనని ఆరోపిస్తున్నారు. ఇసుక రీచ్‌లో తవ్వకాలు మొదలుకుని స్టాక్ పాయింట్లకు తరలింపు, విక్రయాలు, వంటి వాటిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, అధికార పార్టీ నాయకులే వెనకుండి అంతా నడిపిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇసుక సత్యాగ్రహంతో నాలుగేళ్లుగా జగన్ రెడ్డి చేస్తున్న ఇసుక దందా గుట్టు బట్టబయలైందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అక్రమాలు బయట పడతాయని భయంతోనే టిడిపి నేతలు జగన్ రెడ్డి హౌస్ అరెస్టులు చేయిస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు అన్నారు. ఇసుకలో అక్రమాలు లేకుంటే టిడిపి నేతలను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. అరెస్టులతో టీడీపీ పోరాటాన్ని ఆపలేరని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh High Court: భక్తుల కోసం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి.. టీటీడీకి హైకోర్టు ఆదేశం

Advertisment
Advertisment
తాజా కథనాలు