YS Sharmila: కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం..పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల..!!

చలో సెక్రటేరియట్ కు పిలుపునివ్వంతో కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్భంధం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ముందుస్తు అరెస్టుల నేపథ్యంలో పార్టీ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ లోనే ఉండిపోయారు. ఫిబ్రవరి 22న చలో సెక్రేటేరియట్ కు కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చింది.

New Update
YS Sharmila: కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం..పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల..!!

YS Sharmila:  చలో సెక్రటేరియట్ కు పిలుపునివ్వంతో కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్భంధం చేశారు. దగా డీఎస్సీ కాదు మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 22న చలో సెక్రేటేరియట్ కు కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎక్కడిక్కడ కాంగ్రెస్ నేతలు పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల బుధవారం విజయవాడ చేరుకున్నారు. బాపులపాడు మండం అంపాపురంలోని కేవీపీ రామచంద్రరావు నివాసంలో షర్మిల బస చేయాల్సి ఉంది. ముందుస్తు అరెస్టుల నేపథ్యంలో పార్టీ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ లోనే షర్మిల ఉండిపోయారు. రాత్రి పార్టీ కార్యాలయంలోనే బస చేసి గురువారం ఉదయం చలో సెక్రటేరియట్ కు బయలుదేరుతారు.publive-image

కాగా హౌస్ అరెస్టుపై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేయాలని చూస్తారా అంటూ ప్రశ్నించారు. వేలాదిగా తరలివస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారంటూ నిలదీశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా అంటూ ప్రశ్నించారు. ఒక మహిళగా హౌస్ అరెస్టు కాకుండా ఉండేందుకు పోలీసుల నుంచి తప్పించుకుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గడపాల్సిన పరిస్థితి రావడం మీకు అవమానంగా లేదా అంటూ ఫైర్ అయ్యారు. ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా, బారికేడ్లతో బంధించాలని చూసినా నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు