Ayodhya Opening Ceremony : అయోధ్య రాముడు వీఐపీలకే సొంతం..యోగి సర్కార్ షాకింగ్ డెసిషన్

అందరి భగవంతుడు అందకుండా పోయాడు. కేవలం వీఐపీలకు, సెలబ్రిటీలకు మాత్రమే సొంతమయిపోయాడు. యోగి స్కార్ తీసుకున్న షాకింగ్ డెసిషన్ తో ప్రారంభం రోజు రాములోరి దర్శనం సామాన్యులకు కలగానే మిగిలిపోనుంది.

New Update
Ayodhya Ram Mandir:అయోధ్యకు భారీ భద్రత..సీసీ కెమెరాలు, డ్రోన్లు, అడుగడుగుకీ పోలీసులు

Yogi Sarkar : అయోధ్య రాములను కన్నులార వీక్షించుకునే భాగ్యానికి సామాన్యులు దూరం అయిపోయారు. యోగి సర్కారు తీసుకున్న నిర్ణయంతో అయోధ్య(Ayodhya) రామమందిరం ప్రారంభదినోత్సవానికి సామాన్యులు దూరం అయిపోయారు. ఎంతో ఆశలతో ఆరోజు అయోధ్యకు బయలుదేరనున్న ప్రజల ఆశల మీద నీళ్ళు చల్లుతూ ఇప్పటికే బుక్ అయిన హోటల్ బుకింగ్స్ ను రద్దు చేసింది యోగి ప్రభుత్వం. అధికారిక అనుమతి ఉంటేనే హోటల్స్‌లోకి రానివ్వాలని, లేదంటే వారి బుకింగ్స్‌ వెంటనే రద్దు చేయాలని నగరంలోని హోటల్‌ యజమానులకు యోగి సర్కార్‌ నుంచి ఆర్టర్లు వచ్చాయని హోటల్ యజమానులు చెబుతున్నారు. వీలైనన్ని హోటల్‌ గదులు వీవీఐపీలకు అందుబాటులో ఉండేలా  చూడాలని అధికారులకు ఆజ్ఞలు జారీ అయ్యాయి.

Also read:పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ యువతి సవీరా ప్రకాష్

రామాయణ, క్రినోస్కో హోటల్‌, సిజినెట్‌ కలెక్షన్‌, కేకే హోటల్‌, పార్క్‌ ఇన్‌ బై రాడిసన్‌ లాంటి హోల్స్ లో మామూలు యాత్రికుల రూమ్‌ బుకింగ్స్‌ను రద్దు చేశాయి. కొన్ని వేరే రోజులకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నాయి. మా హోటల్‌లోని 60 గదులు ప్రభుత్వమే తీసుకుంది. ఇప్పటివరకు 10 బుకింగ్స్‌ రద్దు చేశాం. మరికొన్నింటిని రద్దు చేయనున్నాం అని చెబుతున్నారు క్రినోస్కో హోటల్‌ ఉద్యోగి ఒకరు. మరోవైపు జనవరి 22న ప్రతిష్టాపన కోసం నగరానికి వచ్చినా.. దర్శనానికి అనుమతి ఉండదని యాత్రికులకు చెబుతున్నామని తెలిపారు హోటల్స్ మేనేజర్లు. అయితే ఈ విషయాన్ని అయోధ్య మున్సిపల్‌ కమిషనర్‌ విశాల్‌ శర్మ ఖండించారు. హోటల్స్ బుకింగ్స్ రద్దు నిజమే అయినా..అది కేవలం భద్రతా చర్యల్లో భాంగానే చేస్తున్నము కానీ వీఐపీల కోసం కాదని చెబుతున్నారు.

ఇక ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో హోటల్స్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకవేళ సామాన్యులకు దర్శన అవకాశం కనిపించినా అది కుదిరేలా లేదు. చిన్న చిన్న హోటల్స్ ధరలు కూడా వామ్మో అనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే ఈ రేట్లు లక్షకు కూడా చేరుకున్నాయి. మరోవైపు రామ మందిరానికి సమీపంలో విలాసవంతమైన గుడారాలను భక్తుల కోసం ఏర్పాటుచేశామని చెబుతున్నారు నిర్వాహకులుజ టెంట్‌ సిటీ పేరుతో నిర్మించిన ఈ గుడారాల్లో 5 నక్షత్రాల హోటల్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా వసతి సౌకర్యాలుంటాయని చెబుతున్నారు. అయితే వీటిని ఎవరికి ఇస్తారు అనేది మాత్రం చెప్పడం లేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు