Weather : వచ్చే పదిరోజుల్లో తెలంగాణలో మండనున్న సూర్యుడు!

అక్టోబర్‌ నెల మొదలైనప్పటి నుంచి కూడా రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతం పై గంటకి సుమారు 17 నుంచి 25 కిలో మీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తున్నాయి.రాష్ట్రంలో రానున్న పది రోజులు కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు.

New Update
Weather : వచ్చే పదిరోజుల్లో తెలంగాణలో మండనున్న సూర్యుడు!

తెలంగాణ(Telangana) లో ప్రస్తుతం నడుస్తుంది ఏ కాలామో కూడా తెలియడం లేదు. వర్షాకాలం సమయంలోనే వరుణుడు అప్పుడప్పుడు నేను ఉన్నాను అంటూ పలకరించాడే తప్ప వానా కాలంలో కురిసినట్లు వర్షాలు మాత్రం పడలేదు. నిజానికి రాష్ట్రానికి ఈ ఏడాది నైరుతి రుతు పవనాల రాక చాలా ఆలస్యం అయ్యింది. జూన్‌ మొదటి వారంలో కురవాల్సిన వానలు..జూన్ చివరి వారం వచ్చినా  జాడే లేదు.

అది కూడా అప్పుడప్పుడు పడ్డాయే తప్ప నిత్యం కురవలేదు. ఆ తర్వాత జులై చివరి వారంలో వానలు ముంచెత్తాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లాయి. జలశయాలు నిండుకుండల్లా మారాయి. ఆ తరువాత ఆగస్టు వరకు వానదేవుడు ముఖమే చూపించలేదు. సెప్టెంబర్‌ లో కూడా ఓ మోస్తరు గానే కురిశాయి తప్ప పెద్దగా వానలు పడలేదు.

Also read: పుంగనూరు అంగల్లు అల్లర్ల కేసుపై నేడు హైకోర్టులో విచారణ..!!

అక్టోబర్‌ నెల మొదలైనప్పటి నుంచి కూడా రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతం పై గంటకి సుమారు 17 నుంచి 25 కిలో మీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న పది రోజులు కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు.

వేసవి కాలం మొదలైనప్పుడు ఎలా ఉంటుందో...అంటే మార్చి మొదటి వారంలో ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా రాష్ట్రంలో అదే విధంగా ఉంది. రానున్న పది రోజుల్లో వాతావరణం పగటి పూట చాలా వేడిగా ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో రాత్రులు, ఉదయం 19 నుంచి 22 డిగ్రీల సెల్సియస్‌ గా ఉంటుందని వారు పేర్కొన్నారు.

పగటి పూట సూర్యుడు చూసుకోండి అంటున్నాడు. సుమారు 33-36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంటున్నారు. ఇక నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలు కాగానే అక్టోబర్‌ 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు