Horror Movie: మీకు భయం లేదా.. ఈ హర్రర్ సినిమా చూసి ఆ మాట చెప్పండి

ఓటీటీలో సినిమాలు చూడడం ఇప్పుడు సాధారణ విషయం. అయితే, ఓటీటీలో ఉండే ఎన్నో సినిమాల్లో మంచి సినిమా ఎదో వెతుక్కోవడం చాలా కష్టమైన విషయం. హర్రర్ సినిమాలు ఇష్టపడే వారికోసం అమెజాన్ ప్రైమ్ లో ఒక సినిమా స్ట్రీమ్ అవుతోంది. ఆ సినిమా వివరాలకోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్లాల్సిందే. 

Horror Movie: మీకు భయం లేదా.. ఈ హర్రర్ సినిమా చూసి ఆ మాట చెప్పండి
New Update

 Horror Movie: ఒకటి రెండు సినిమాల్లో ఏది మంచిదో, ఏది కాదో తేలిగ్గా చెప్పేస్తుంది. కానీ ఇప్పుడు OTT పరిస్థితి అలా లేదు, కాకపోయినా సినిమాలు వస్తూ పోతూనే ఉన్నాయి. దీంతో సినీ ప్రేమికులు అనుకోకుండా కొన్ని సినిమాలను మిస్ అయిపోతున్నారు. మంచి సినిమాలను వెతుక్కోవడం కష్టంగా మారిపోతోంది. సాధారణంగా అందరూ మంచి సినిమాలను చూడాలని అనుకుంటారు. OTTలో ఉత్తమ చిత్రాల కోసం చూస్తారు. అలాంటి వారి కోసమే ఒక అద్భుతమైన హారర్ సినిమా(Horror Movie) పరిచయం చేయబోతున్నాం.  హారర్ చిత్రాల్లో కూడా డిఫరెంట్ జానర్లు ఉంటాయి. కొందరు మిమ్మల్ని మీ సీటు అంచున కూర్చోబెడతారు. మరి కొన్ని సినిమాలు వారం పదిరోజులైనా మనసును వదలవు. ఇప్పుడు చెప్పబోయే సినిమా కూడా అలాంటిదే. ఇంకా ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి సినిమా(Horror Movie) ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.

Also Read: నవ్విస్తూనే భయం పుట్టించిన సినిమా ఓటీటీ ఫిక్స్!

Horror Movie: ఈ సినిమాలో జో అనే వ్యక్తి టిక్కెట్ ఇన్‌స్పెక్టర్. కానీ అతని కష్టానికి తగిన ఫలితం లభించదు. ఒకరోజు జో తన సహోద్యోగి రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో షిఫ్ట్ కూడా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇది అతనికి ఇష్టం లేకపోయినా, ఆ రాత్రి చివరి రైలులో కండక్టర్‌గా వెళ్తాడు. ఈ నిర్ణయం తన జీవితాన్ని మారుస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ రోజు అర్ధరాత్రి తెలియని ప్రాంతంలో దట్టమైన అడవి మధ్యలో రైలు ఆగుతుంది. దిగి రైలు ఎందుకు ఆగిందని తెలుసుకోవడానికి డ్రైవర్ ప్రయత్నిస్తుంటే… ఓ వింత జీవి(Horror Movie) వచ్చి డ్రైవర్‌ని చంపి తింటుంది. ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూచుంటారు.  అక్కడ నుండి బయటకి వచ్చే ప్రయత్నంలో ఒక వృద్ధురాలి కాలికి దెబ్బ తగులుతుంది. ఆ తరువాత ఆమె కూడా ఒక వింత జీవిగా మారుతుంది. ఇక తరువాత ఏమి జరగబోతోంది అనేది అందరికీ (Horror Movie)టెన్షన్ మొదలవుతుంది. ఆ వింత ప్రాణి నుంచి ప్రయాణీకులు ఎలా తప్పించుకున్నారు? వింతగా కనిపించే ఆ జీవి ఏమిటి? అది ఎక్కడి నుంచి వచ్చింది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పేరు "హౌల్". ఇది హాలీవుడ్ సినిమా అయినప్పటికీ...తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది.  ప్రస్తుతం ఈ  "హౌల్" అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది.

ఏ హారర్ చిత్రమైనా(Horror Movie) ప్రధాన పాత్రలతో ప్రేక్షకుల ప్రమేయం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకుడికి ఎక్సయిటింగ్ ఫీలింగ్ ఇస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. ప్రతి క్షణం ఉత్కంఠగా ఉంటుంది. 2015లో విడుదలైన ఈ చిత్రానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరైనా ఈ సినిమా మిస్ అయితే వెంటనే చూడండి. గొప్ప హారర్ సినిమా చూడాలని అనుకుంటే ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. 

#ott-movies #horror-film
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe