Gannavaram : ఉపాది కూలీలపై తేనేటీగల దాడి.. 50 మందికి పైగా గాయాలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా బూరుగుగుంటలో ఉపాది కూలీలపై పైతేనేటీగలు దాడి చేశాయి. 50 మందికి పైగా దాడికి గురవగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్ లో గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణ నష్టం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.

Gannavaram : ఉపాది కూలీలపై తేనేటీగల దాడి.. 50 మందికి పైగా గాయాలు
New Update

AP News : అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District) పి.గన్నవరం మండలం బూరుగుగుంటలో దారుణం చోటుచేసుకుంది. ఉపాది కూలీలపై తేనేటీగలు (Bees) దాడి చేశాయి. తేనెటీగల దాడిలో 50 మందికి పైగా గాయపడగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్ లో పి.గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రి (P Gannavaram Government Hospital) కి తరలించారు. మహిళల మొహం, తలపై, కళ్లపై దారుణంగా కుట్టిన తేనెటీగలు కుట్టడంతో భయాందోళనకు గురయ్యారు. అక్కడినుంచి పరుగులు పెట్టారు. ఉపాదికూలీలు పనిచేసే చోట కనీసం తాగునీరు (Drinking Water) కూడా ఏర్పాటుచేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా తీవ్ర ఎండ, వాడగలు వీస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఎండలో పనిచేస్తున్న వారికి కనీసం మంచినీళ్లు సదుపాయం కుడా కల్పించడం లేదని ఆవేదన చెందుతున్నారు.

Also Read : ”సూసేకి అగ్గిరవ్వ మాదిరి’… పిచ్చెక్కిస్తున్న పుష్ప కపుల్ సాంగ్..!

#p-gannavaram #honey-bee-attack
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe