Gannavaram : ఉపాది కూలీలపై తేనేటీగల దాడి.. 50 మందికి పైగా గాయాలు అంబేడ్కర్ కోనసీమ జిల్లా బూరుగుగుంటలో ఉపాది కూలీలపై పైతేనేటీగలు దాడి చేశాయి. 50 మందికి పైగా దాడికి గురవగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్ లో గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణ నష్టం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. By srinivas 29 May 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి AP News : అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District) పి.గన్నవరం మండలం బూరుగుగుంటలో దారుణం చోటుచేసుకుంది. ఉపాది కూలీలపై తేనేటీగలు (Bees) దాడి చేశాయి. తేనెటీగల దాడిలో 50 మందికి పైగా గాయపడగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్ లో పి.గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రి (P Gannavaram Government Hospital) కి తరలించారు. మహిళల మొహం, తలపై, కళ్లపై దారుణంగా కుట్టిన తేనెటీగలు కుట్టడంతో భయాందోళనకు గురయ్యారు. అక్కడినుంచి పరుగులు పెట్టారు. ఉపాదికూలీలు పనిచేసే చోట కనీసం తాగునీరు (Drinking Water) కూడా ఏర్పాటుచేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా తీవ్ర ఎండ, వాడగలు వీస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఎండలో పనిచేస్తున్న వారికి కనీసం మంచినీళ్లు సదుపాయం కుడా కల్పించడం లేదని ఆవేదన చెందుతున్నారు. Your browser does not support the video tag. Also Read : ”సూసేకి అగ్గిరవ్వ మాదిరి’… పిచ్చెక్కిస్తున్న పుష్ప కపుల్ సాంగ్..! Your browser does not support the video tag. #p-gannavaram #honey-bee-attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి