Money Tips: అప్పులు తీరాలంటే చేయాల్సిన పనులు ఇవే.. మీరు కూడా ట్రై చేయండి!

చేసిన అప్పు త్వరగా తీరాలంటే శుక్రవారం ఇంటిని చక్కగా పరిశుభ్రంగా పెట్టుకోవాలి. కొబ్బరికాయ లక్ష్మీఫలం. కాబట్టి కొబ్బరికాయని ఎరుపురంగు వస్త్రంలో చుట్టి డబ్బు నిల్వ చేసే చోట భద్రంగా దాచి ఉంచాలి. ఇలా పెడితే సంపద రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు.

Money Tips: అప్పులు తీరాలంటే చేయాల్సిన పనులు ఇవే.. మీరు కూడా ట్రై చేయండి!
New Update

Money Tips: నేటికాలంలో టెక్నాలజీ పెరిగింది డబ్బు సంపాదన కూడా పెరిగింది. అయినా సరే కొంతమంది అప్పులు చేసి జీవితాన్ని గడపలేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఎంత డబ్బు సంపాదించినా ఇల్లు కడటం కష్టంగా ఉంటుంది. దీంతో చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు. ఈ అప్పు తీర్చడానికి చాలా ఇబ్బంది పడటంతోపాటు కొందరూ ప్రాణాలు కూడా తీసుకుంటారు అయితే మన ఇంట్లో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఎన్ని కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోవడంతో పాటు ఆనందం, ఐశ్వర్యం కూడా కలుగుతాయని పండితులు చెప్తున్నారు. అయితే అప్పు తీర చిట్కాలు ఏంటో వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

అప్పులు తీరాలంటే చేయాల్సిన పనులు:

  • చేసిన అప్పు తీరిపోవాలంటే శుక్రవారం ఇంటిని చక్కగా పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ప్రతి ఇల్లాలు ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. పరిపూర్ణమైన ఆనందం ఐశ్వర్యం సంపద మీకు దక్కేలా చేస్తుంది.
  • ప్రతీరోజూ పూజగదిని శుభ్రం చేసి పరిమళం వెదజల్లేటువంటి పూలతో పూజ చేసుకోవాలి. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది.
  • కొబ్బరికాయని స్త్రీ ఫలం అంటారు. కొబ్బరికాయ తప్పనిసరిగా ఇంట్లో పెట్టుకోవాలి. కొబ్బరికాయ లక్ష్మీఫలం కాబట్టి అత్యంత స్వచ్ఛమైనది. దీనిని ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది.
  • ఇంకొకటి కొబ్బరికాయని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి డబ్బు నిల్వ చేసే చోట భద్రంగా దాచి ఉంచాలి. ఇలా పెడితే సంపద రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు.
  • శుక్రవారం రోజున ఆవులకు గడ్డి, బెల్లాన్ని తినిపించిన అప్పులు తీరుతాయి.
  • శుక్రవారం కచ్చితంగా నేయితో దీపారాధన చేయాలి. ఇలా కొన్ని వారాలు చేస్తే ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్ని కూడా పూర్తిగా తొలగిపోయి..లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా మనసుకి హాయిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#money-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe