Home Tips : ఇనుప వస్తువుల తుప్పు ఇలా వదిలించేయవచ్చు.. మళ్ళీ కొత్తగా అయిపోతాయి

ఇళ్లలో ద్వారాలు, కిటికీలు, గేట్లకు ఇనుప వస్తువులకు తుప్పు పడితే.. ముందు దుమ్ము, ధూళి తొలగించాలి. గిన్నెలో బోరాక్స్ పొడి, కొద్దిగా నీటిని కలిపి పేస్ట్‌ చేయాలి. దానిని తుప్పు పట్టిన దానిమీద అప్లై చేసి 10 నిమిషాల తరువాత ఇసుక అట్టతో ఇనుముపై తుప్పును శుభ్రం చేయాలి.

New Update
Home Tips : ఇనుప వస్తువుల తుప్పు ఇలా వదిలించేయవచ్చు.. మళ్ళీ కొత్తగా అయిపోతాయి

Rust From Iron : ప్రతి ఇళ్లలో ఇనుము(Iron) తో చేసిన అనేక వస్తువులు ఉంటాయి. నీరు పడటం వలన ఇనుముతో తయారు చేయబడిన వస్తువులు తుప్పు పడుతుంటాయి. ఈ సమయంలో కొన్నిటితో ఇనుము నుంచి తుప్పు తొలగించవచ్చు. చాలా ఇళ్లలో ద్వారాలు(Doors), కిటికీలు(Windows) ఇనుముతో చేసినవి పెడుతుంటారు.  చాలా సార్లు గేటు తుప్పు పట్టడం వల్ల పాడైపోవడంతో దాన్ని మార్చాల్సి వస్తుంది. అయితే ఇంట్లో పాతపడిన  వస్తువలను తుప్పు పడితే.. ఐరన్ వస్తువు కొత్తది అయ్యేలా చేసే పద్ధతి కొన్ని ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

తుప్పును ఎలా శుభ్రం:

  • ముందుగా బోరాక్స్ పౌడర్(Borax Powder), ఇసుక అట్ట కొనాలి. ఇనుప వస్తువులను శుభ్రం చేయడానికి బోరాక్స్ పౌడర్‌ చక్కగా పని చేస్తుంది. అయితే ఇంట్లో ఉన్న ఇనుముపై ఉన్న తుప్పును శుభ్రం చేయడానికి.. ముందుగా ఇనుము నుంచి దుమ్ము, ధూళి మొత్తం తొలగిపోయేలా గుడ్డతో శుభ్రం చేయాలి. ఇనుముపై ఉన్న రస్ట్‌ను బోరాక్స్ పౌడర్‌తో సులభంగా తొలగిపోతుంది. ఓ గిన్నెలో 3, 4 స్పూన్ల బోరాక్స్ పొడిని తీసుకొని.. దానికి కొద్దిగా నీటిని కలిపి పేస్ట్‌ను సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తుప్పు పట్టిన దానిమీద అప్లై చేసి 5 నుంచి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత.. ఇసుక అట్టతో ఇనుముపై తుప్పును శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఇనుముపై ఉన్న తుప్పు సులభంగా శుభ్రం అవుతుంది.

సున్నం పొడితో శుభ్రం:

  • ఇనుముపై ఉన్న తుప్పును సున్నం పొడి సులభంగా శుభ్రం చేస్తుంది. తుప్పును సున్నపు పొడితో శుభ్రం చేయడానికి.. బోరాక్స్ పొడి, సున్నపు పొడిని సమానంగా కలుపుకోవాలి. దానిలో కొద్దిగా నీరు కలుపుతూ మందపాటి పేస్ట్‌ను సిద్ధం చేసుకన్న తరువాత తుప్పు పట్టిన ప్రదేశంలో రాయాలి.  ఐదు నిమిషాలు ఉంచిన తరువాత ఇసుక అట్టతో రుద్దితే వస్తువుకి పట్టిన ఇనుమును శుభ్రంగా పొంతుంది.

ఇది కూడా చదవండి : దంతాల్లో రక్తం వస్తే అది దేనికి సంకేతం..ప్రమాదకరం అవుతుందా..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: గర్భిణీలు ఎక్కువ నడిస్తే ఇబ్బందులు వస్తాయి.. ఈ భాగాల్లో నొప్పులకు అవకాశం!

Advertisment
తాజా కథనాలు