Health Tips: నోటి దుర్వాసన నలుగురిలో ఇబ్బంది పెడుతుందా..? అయితే ఈ ఇంటి నివారణలను ప్రయత్నించండి!

ఆహారంలో ఉపయోగించే దాల్చిన చెక్క ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా పంటి నొప్పి, నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. సిన్నమిక్ ఆల్డిహైడ్ అనే మూలకం దాల్చిన చెక్కలో ఉంటుంది. ఇది నోటి దుర్వాసనను సులభంగా తొలగిస్తుంది.

New Update
Health Tips: నోటి దుర్వాసన నలుగురిలో ఇబ్బంది పెడుతుందా..? అయితే ఈ ఇంటి నివారణలను ప్రయత్నించండి!

నోటి దుర్వాసన అంటే పది మంది ముందు ఇబ్బంది పెట్టే విషయం. చాలా మంది తమ నోరు దుర్వాసన వస్తున్న విషయాన్ని కూడా పట్టించుకోరు..అసలు గుర్తించలేరు. అలాంటి పరిస్థితిలో ఎవరైనా ఈ విషయం గురించి చెబితే వారు చాలా ఇబ్బంది పడతారు. నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలను ప్రయత్నిస్తారు..కానీ అది కొద్ది సేపు మాత్రమే.

నోటి దుర్వాసనలో నోటి పరిశుభ్రత ప్రధాన పాత్ర పోషిస్తుంది. నోటి పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇది కాకుండా, ఈ సమస్యను వదిలించుకోవడానికి కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు.

నోటి దుర్వాసనను తొలగించే ఇంటి నివారణలు:

దాల్చిన చెక్క:

ఆహారంలో ఉపయోగించే దాల్చిన చెక్క ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా పంటి నొప్పి, నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. సిన్నమిక్ ఆల్డిహైడ్ అనే మూలకం దాల్చిన చెక్కలో ఉంటుంది. ఇది నోటి దుర్వాసనను సులభంగా తొలగిస్తుంది. దాల్చిన చెక్క టీ తాగండి. దాల్చిన చెక్క పొడి నీటితో పుక్కిలించండి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన రాదు.

సోంపు:

సోంపు సాధారణంగా మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగింపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ నోటి దుర్వాసనను సులభంగా తొలగిస్తాయి. నోటి నుండి చాలా దుర్వాసన వస్తుంటే, సోంపు పాకెట్ ఎల్లప్పుడూ ఉంచుకోండి. రోజుకు 3-4 సార్లు తినండి. ప్రతిరోజూ ఉదయం సోంపు టీ తాగవచ్చు. దీంతో నోటి దుర్వాసన రాదు

లవంగం:

లవంగం కేవలం టీ, డికాక్షన్, బిర్యానీ తయారీకి మాత్రమే ఉపయోగించరు. అనేక గుణాలు కలిగిన ఈ లవంగం పంటి నొప్పిని తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నోటి దుర్వాసనను కూడా తొలగిస్తుంది. లవంగాలు లేక లవంగం నూనెను ఉపయోగించడం ద్వారా నోటి దుర్వాసనను సులభంగా తొలగించవచ్చు. లవంగం నోటిలోని బ్యాక్టీరియాను చాలా సులభంగా చంపుతుంది.

ఎక్కువ నీరు త్రాగాలి:

తక్కువ నీరు త్రాగితే, నోటి దుర్వాసన కూడా వస్తుంది. అందువల్ల వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. శరీరం హైడ్రేట్ అయినప్పుడు నోటి నుండి వాసన ఉండదు.

-ఉదయం, రాత్రి పడుకునే ముందు రోజుకు రెండుసార్లు బాగా బ్రష్ చేయండి.
-బ్రష్ చేసిన తర్వాత నాలుకను పూర్తిగా శుభ్రం చేసుకోండి.
-వీలైతే, రోజుకు ఒకసారి మౌత్ వాష్ ఉపయోగించండి
-ఉల్లి, వెల్లుల్లి తిన్న వెంటనే సోపు తినండి.
-మద్యం, సిగరెట్లు, పొగాకు మానేయండి
-ఆహారం తిన్న తర్వాత తప్పకుండా నోరు కడుక్కోవాలి.

Also read: కేవలం ఒక గిన్నె సలాడ్‌ చాలు… వేలాడే కొవ్వును ఇట్టే కరిగిస్తుంది..తినడానికి బెస్ట్ టైమ్‌ ఏంటంటే!

Advertisment
తాజా కథనాలు