Home Loan Rules : మీ హోమ్ లోన్ బ్యాంక్ మార్చాలని అనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

హోమ్ లోన్ తీసుకున్న తరువాత ఏదైనా ఇబ్బందులు తలెత్తి.. ఈఎంఐలు చెల్లించడంలో సమస్యలు ఎదురైతే.. హోమ్ లోన్ డిఫాల్టర్ గా మారకుండా ఉండడం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఎదురైనపుడు ఏమి చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

Home Loan Rules : మీ హోమ్ లోన్ బ్యాంక్ మార్చాలని అనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
New Update

Home Loan Bank : సొంతఇంటి(Own House) కల నెరవేర్చుకోవాలంటే.. హోమ్ లోన్ తీసుకోవడం తప్పనిసరి చాలామందికి. ఎక్కువ శాతం హోమ్ లోన్ తీసుకునే ఇల్లు కొనడం సహజంగా జరుగుతుంటుంది. అలాగే తమ జీతంలో చాలా భాగం హోమ్ లోన్ EMI చెల్లించడానికి ఖర్చు అయిపోతుంది. సుదీర్ఘమైన సమయం.. భారీ మొత్తం కారణంగా, చాలాసార్లు హోమ్ లోన్ తిరిగి చెల్లించడంలో ఎక్కువ మంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు డీఫాల్టర్ గా మారకుండా ఉండడం ఎలా అనే టెన్షన్ చాలామందికి ఎదురవుతుంది. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చినపుడు హోమ్ లోన్(Home Loan Rules)  తీసుకున్నవారికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. హోమ్ లోన్  రీఫైనాన్సింగ్అలాగే, హోమ్ లోన్ రీస్ట్రక్చరింగ్(గృహరుణ పునర్నిర్మాణం). ఈ విధానాలను ఎంచుకునే ముందు వాటి గురించి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

హోమ్ లోన్ రీఫైనాన్సింగ్‌లో, ప్రస్తుతం ఉన్న హోమ్ లోన్(Home Loan Rules) కొత్త హోమ్ లోన్ తో  రీప్లేస్ చేస్తారు.  అంటే పాత రుణం చెల్లించేందుకు కొత్త రుణం తీసుకోవడం జరుగుతుంది.  కొత్త లోన్ కు సంబంధించిన నిబంధనలు ఇప్పటికే ఉన్న లోన్ కంటే మెరుగ్గా ఉన్నప్పుడు రీఫైనాన్సింగ్ విధానం ఉపయోగపడుతుంది. కొత్త లోన్ ద్వారా, అప్పటికే పెండింగ్ ఉన్న లోన్ క్లియర్ చేస్తారు. తరువాత కొత్త లోన్ కు సంబంధించిన  వాయిదాలు ప్రారంభమవుతాయి. దీనిని హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్  అని కూడా అంటారు.

కొత్త రుణం(Home Loan Rules) కోసం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా రుణ మొత్తంలో నిర్ణీత శాతంగా ఉంటుంది.  కొన్ని బ్యాంకులు కనీస - గరిష్ట మొత్తాలను కూడా ప్రాసెసింగ్ ఫీజుగా ఉంచుతాయి. ఉదాహరణకు, SBI 0.35 శాతం వరకు, HDFC బ్యాంక్ 0.50 శాతం వరకు లేదా రూ 3000, ఏది ఎక్కువ అయితే అది ప్రాసెసింగ్ ఫీజుగా నిర్ణయిస్తారు.  బ్యాంక్ ఆఫ్ బరోడా 0.40 శాతం లేదా గరిష్టంగా రూ. 15,000 వరకు. ICICI బ్యాంక్ 0.50 నుండి 2 శాతం లేదా రూ. 3000, ఏది ఎక్కువ అయితే అది ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తోంది. దీనిపై 18 శాతం జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. 

గృహ రుణాన్ని ప్రభావితం చేసే అంశాలు ఇవే..

గృహ రుణాన్ని(Home Loan Rules)  ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు బదిలీ చేసేటప్పుడు, వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇలా ఉంటాయి. 

మొదటిది- మీరు రుణం తీసుకున్నప్పుడు, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండవచ్చు. అప్పటి నుంచి చూసుకుంటే, ఇప్పుడు వడ్డీ రేట్లు తక్కువ స్థాయికి పడిపోయి ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు మరొక బ్యాంకుతో మాట్లాడటం ద్వారా రుణాన్ని రీఫైనాన్స్ చేయవచ్చు. మీ EMIని తగ్గించే ప్రస్తుత రేట్లను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ తక్కువ రేటును అందించవచ్చు.

రెండవది- గృహ రుణం(Home Loan Rules)  తీసుకుంటున్నప్పుడు, క్రెడిట్ స్కోర్ బాగా లేకుంటే అంటే 700-750 కంటే ఎక్కువ ఉంటే బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి. లోన్ తీసుకున్న తర్వాత సకాలంలో చెల్లింపులు చేయడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడితే, మీరు లోన్ రీఫైనాన్స్ పొందవచ్చు. ఇతర బ్యాంకులు మీ మంచి క్రెడిట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వవచ్చు.

మూడవది- అధిక EMI మొత్తం కారణంగా మీరు సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు ఇప్పటికీ తక్కువ వడ్డీ రేట్లు లేదా ఎక్కువ కాల వ్యవధిని అందించే ఇతర బ్యాంకులకు రుణాన్ని(Home Loan Rules)  బదిలీ చేయవచ్చు. 

వీటిని చెక్ చేసుకోవాలి..

హోమ్ లోన్‌ని(Home Loan Rules)  బదిలీ చేయడానికి ముందు, ఎంత గడువు మిగిలి ఉందో చెక్ చేయండి. కొన్నేళ్ల క్రితం రుణం ప్రారంభించి, వడ్డీ రేటు(Interest Rate) ఎక్కువగా ఉంటే, రుణాన్ని బదిలీ చేయడం మంచిది. ఎందుకంటే రుణం ప్రారంభంలో ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకే వెళ్తుంది. రుణ బదిలీపై వడ్డీ రేటులో చిన్న తగ్గింపు మొత్తం పదవీకాలంలో చాలా వడ్డీని ఆదా చేస్తుంది. రుణం గడువు ముగియడానికి తక్కువ సంవత్సరాలు మిగిలి ఉన్నట్లయితే, రీఫైనాన్సింగ్ ఎక్కువ ప్రయోజనాన్ని అందించదు. లోన్ రీఫైనాన్సింగ్ తర్వాత, ఇప్పుడు లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి అర్థం చేసుకుందాం.

Also Read : డాలర్ vs బంగారం.. సీన్ రివర్స్.. బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే.. 

లోన్ రీస్ట్రక్చరింగ్

రుణ పునర్నిర్మాణం(లోన్ రీస్ట్రక్చరింగ్) అంటే ఇప్పటికే ఉన్న రుణ నిబంధనలను మార్చడం. బ్యాంకులు కస్టమర్ సౌలభ్యం కోసం వీటిని మారుస్తాయి.  తద్వారా లోన్ తీసుకున్నవారు  రుణ డిఫాల్ట్‌ను నివారించడానికి అసలు మొత్తం -  రుణంపై వడ్డీ రెండింటినీ తిరిగి చెల్లించగలడు. రుణం తీసుకునే సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. సకాలంలో EMI చెల్లించారు. ఇప్పుడు మీరు అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం, జీతం తగ్గడం, వ్యాపారంలో నష్టం లేదా మరేదైనా కారణాల వల్ల EMI చెల్లించలేకపోతే, మీరు బ్యాంక్‌తో మాట్లాడి మీ రుణాన్ని పునర్నిర్మించుకోవచ్చు.

గృహ రుణ పునర్నిర్మాణం వివిధ మార్గాల్లో చేయవచ్చు. లోన్ EMIని తగ్గించడం, లోన్ రీపేమెంట్ కాలపరిమితిని పెంచడం, వాయిదాల సంఖ్యను మార్చడం, వడ్డీ రేటు లేదా మారటోరియం సర్దుబాటు చేయడం, అంటే రుణ వాయిదాను తాత్కాలికంగా నిలిపివేయడం వంటివి ఇందులో ఉన్నాయి. ఇది బ్యాంకు విచక్షణపై ఆధారపడి ఉంటుంది. హోమ్ లోన్ రీస్ట్రక్చరింగ్ అనేది.. అన్నిదారులు మూసుకుపయినా తరువాత ఆలోచించాల్సిన చివరి ఎంపిక అని గుర్తుంచుకోండి. మీరు ప్రస్తుత నిబంధనలతో రుణాన్ని(Home Loan Rules)  తిరిగి చెల్లించే స్థితిలో లేనప్పుడు మాత్రమే దీన్ని ఎంచుకోండి. రుణ పునర్నిర్మాణం యొక్క లక్ష్యం ఇబ్బందుల్లో ఉన్న రుణగ్రహీతకు కొంత ఉపశమనం కలిగించడం. అయితే, రుణాన్ని పునర్నిర్మించడం క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందనే విషయం తెలుసుకోవాలి. 

#home-loan-restucturing #home-loan #emi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe