Assam Government : అస్సాం (Assam) ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఉద్యోగులు (Employees) తమ తల్లిదండ్రులు, అత్తామామలతో సరదాగా గడిపేందుకు నవంబర్ నెలలో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాజువల్ సెలవులను ఇవ్వనున్నట్లు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
అయితే తల్లిదండ్రులు, అత్తామామలు లేనివారికి ఈ సెలవులు వర్తించవని, ఆ సెలవులను వ్యక్తిగత సరదాలకు, కారణాలకు ఉపయోగించుకుంటే చర్యలు తప్పవని షరతులు కూడా విధించింది. వృద్దులుగా మారుతున్న పెద్దలను గౌరవించుకునేందుకు ఈ సెలవులను ఇవ్వనున్నట్లు అక్కడి ప్రభుత్వం వివరించింది.
నవంబర్ 6,8 తేదీల్లో ఈ సెలవులను వినియోగించుకోవాలని సూచించింది. ఎందుకంటే.. నవంబర్ 7న ఛత్ పూజ, 9 న రెండో శనివారం, 10న ఆదివారం సెలవులతో పాటు అస్సాం ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రెండు రోజుల ప్రత్యేక సెలవులు (Holidays) కలిసిరానున్నాయి.
Also read: ఆర్‌ఆర్‌ఆర్ కి అవార్డుల పంట..మెరిసిన సీతామహాలక్ష్మి!