School holidays: పిల్లలకు సెప్టెంబర్‌లో పండుగే పండుగా.. ఎన్ని రోజులు సెలవులంటే?

ఈ సెప్టెంబర్‌లో విద్యార్థులకు మొత్తం ఏడు రోజులు సెలవులు వచ్చాయి. నాలుగు ఆదివారాలతో పాటు సెప్టెంబర్‌ 6న జన్మాష్టమి, సెప్టెంబర్ 18న వినాయక చతుర్థి, సెప్టెంబర్ 28న మిలాద్ ఉన్-నబీ / ఈద్-ఎ-మిలాద్ వచ్చాయి. మరోవైపు ఢిల్లీలో పిల్లలకు మరో మూడు రోజుల సెలవులు అదనం.. జీ20 సమావేశాల కారణంగా సెప్టెంబర్‌ 8,9,10 తేదీల్లో దేశరాజధానిలో స్కూల్స్‌కి హాలీడే ప్రకటించారు..

School holidays: పిల్లలకు సెప్టెంబర్‌లో పండుగే పండుగా.. ఎన్ని రోజులు సెలవులంటే?
New Update

Holidays for schools in september: ఎగ్జామ్ డేట్స్‌ అంటే భయం.. హాలీడేస్‌ డేట్స్‌ అంటే ఇష్టం.. 'స్కూల్‌కి సెలవు' అనే మాట వినిపిస్తే ఫస్ట్ బెంచర్‌ నుంచి లాస్ట్ బెంచర్‌ వరకు ప్రతి ఒక్కరిలోనూ తెలియని ఆనందం వికసిస్తుంది. తెలియకుండానే పిల్లల పెదాలపై చిరునవ్వు కనిపిస్తుంది. సెలవు, హాలీడే, బంద్‌ అనే పదాలకు ఉండే మహిమ అలాంటిది. ఇది అనుభవించినవాడికే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ స్కూల్‌ డేస్‌లో ఈ హాలీడేస్‌ కోసం ఎంతగానో వెయిట్ చేసి ఉంటారు. స్కూల్‌ జూన్‌లో స్టార్ట్ అవుతుంది.. ఆ నెల, జులైలో పెద్దగా హాలీడేస్‌ ఉండవు.. ఆగస్టు, సెప్టెంబర్‌ నుంచి సెలవులు మొదలువుతాయి. ఏ నెలలో ఏ రోజు హాలీడే ఉందా అని.. స్కూల్‌ క్యాలెండర్‌తో పాటు ఇంట్లోని క్యాలెండర్‌ని కూడా తిరగెస్తుంటారు.

సెప్టెంబర్‌లో ఎన్ని రోజులు సెలవులు?

సెప్టెంబర్‌లో 30 డేస్‌ ఉండగా.. అందులో ఏడు రోజులు స్కూల్స్‌కి హాలీడే.. నాలుగు ఆదివారాలు కాకుండా మూడు పండుగలు వచ్చాయి.

జన్మాష్టమి: సెప్టెంబర్‌ 6

వినాయక చతుర్థి: సెప్టెంబర్ 18

మిలాద్ ఉన్-నబీ / ఈద్-ఎ-మిలాద్: సెప్టెంబర్ 28

ఆదివారాలు:

సెప్టెంబర్‌ 3

సెప్టెంబర్ 10

సెప్టెంబర్‌ 17

సెప్టెంబర్ 24

ఇవి కాకుండా చాలా స్కూల్స్‌కి సెకండ్‌ సాటర్‌డే హాలీడే ఉంటుంది.. మరికొన్ని స్కూల్స్‌కి ఎవ్రీ సాటర్‌డే హాఫ్‌ డే ఉంటుంది.

మరోవైపు ఢిల్లీలో పిల్లలకు మరింత హ్యాపీన్యూస్‌ ఇది. జీ20 సమావేశాల కారణంగా వారికి అదనంగా మరో మూడు రోజులు సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్‌ 9,10న జీ20 సమావేశం జరగనుంది. ఇండియా ఈ ప్రతిష్టాత్మక సదస్సును తొలిసారి హెస్ట్ చేస్తుంది. విదేశాల నుంచి గెస్టులు భారీగా రానున్నారు. ట్రాఫిక్‌ సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఢిల్లీలో స్కూల్స్‌కి మూడు రోజులు హాలీడే ప్రకటించారు. సెప్టెంబర్ 8,9,10లో స్కూల్‌ క్లోజ్ చేసి ఉంటాయి. దీని వల్ల రోడ్డుపై స్కూల్‌ బస్సులు ఎక్కువగా తిరుగకుండా ఉంటాయి.. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు.

అటు బ్యాంక్ ఉద్యోగులకు భారీ సెలవులు:

మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్‌లో 16 రోజులు బ్యాంక్‌లకు హాలీడేస్‌ ఉన్నాయి. వివిధ పండుగలు, రెండో నాల్గవ శని, ఆదివారాలలో ఎప్పటిలాగే బ్యాంకులు క్లోజ్‌. అత్యవసర పనుల కోసం బ్యాంకులకు వెళ్లాలనుకునే కస్టమర్లు సెప్టెంబర్‌లో లిస్టెడ్ బ్యాంక్ సెలవులను గమనించాలి. ఏదేమైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు వినియోగదారులకు అన్ని రోజులూ అందుబాటులో ఉంటాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, మహారాజా హరిసింగ్ జయంతి, ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీకి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి.

ALSO READ: సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఏకంగా 16 రోజులు సెలవులు.. లిస్ట్ చూసుకోండి!

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe