Tamilnadu rains: కుండపోతగా వర్షాలు..స్కూళ్లు, కాలేజీలు బంద్‌!

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలుండడంతో అధికారులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

New Update
TS Weather : చల్లబడిన వాతావరణం..మరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు..!

భారీ వర్షాలతో తమిళనాడు(Tamialanadu) లో భారీ వర్షాలు (Heavy rains)  పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి వాన కురుస్తుంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కడలూర్‌, మైలాదుతురై, విల్లుపురం జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే పుదుచ్చేరిలో మంగళవారం నాడు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో స్కూళ్లకు, కాలేజీలకు హాలీడే ఇచ్చారు. చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, చుద్దలోర్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశలున్నాయని అధికారులు తెలిపారు.

రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ క్రమంలోనే ఏపీ ప్రజలకు కూడా వాతావరణ శాఖ అధికారులు గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

రానున్న 2-3 రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడే మరో అల్పపీడనం తీవ్ర అల్పపీడనం గా మారనుంది. ఇది 16 వ తేదీ నాటికి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం మారనుంది.

రానున్న రెండు మూడు రోజుల పాటు రాయలసీమ, ఉత్తరకోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ఆవర్తనం కూడా ఉన్నట్లు సమాచారం. నవంబర్ 15, 16 తేదీల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడనున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం తుఫానుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.

Also read: బాలల దినోత్సవం సందర్భంగా… మీ పిల్లలకు ఈ గిఫ్ట్ ఇవ్వండి..!!

Advertisment
తాజా కథనాలు