Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం

తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. కల్తీ సారా ఘటనపై అసెంబ్లీలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. డీఎంకే ఆధ్వర్యంలోనే సారా విక్రయిస్తున్నారని ఆరోపణలు చేశాయి. అసెంబ్లీని రేపటి వాయిదా వేశారు. కల్తీ సారా ఘటనలో ఇప్పటికి 35 మంది మృతి చెందారు.

Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం
New Update

Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. కల్తీ సారా ఘటనపై అసెంబ్లీలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. డీఎంకే ఆధ్వర్యంలోనే సారా విక్రయిస్తున్నారని ఆరోపణలు చేశాయి. మృతులకు అసెంబ్లీలో సంతాప తీర్మానం చేశారు. కాగా అసెంబ్లీని రేపటి వాయిదా వేశారు. మరోవైపు కల్తీ సారా పై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎం స్టాలిన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్, డీజీపీ హాజరయ్యారు. ఇప్పటికే ఈ కల్తీ సారా ఘటనలో 35 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 95 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

అసలేం జరిగింది...

తమిళనాడులో ఘోర విషాదం నెలకొంది. కల్లకురిచిలో కల్తీసారా తాగి 35మంది మృతి చెందగా..ఆసుపత్రిలో 95 మంది చికిత్స పొందుతుండగా వారిలో 30మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతదేహాలతో సారా కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. సారా దుకాణాన్ని గ్రామస్థులు ధ్వంసం చేశారు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అలర్ట్‌ అయిన ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించింది. కల్తీ సారా తాగి 18 మంది మృతి చెందిన ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ..రాష్ట్రంలో కల్తీసారా యథేచ్చగా దొరుకుతుందని , రాష్ట్రం కల్తీసారాకి అడ్డాగా మారిపోయిందని మాజీ సీఎం పళని స్వామి ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు.

కల్తీసారా తాగి ఒక్కసారిగా 35 మంది మృతి చెందడంతో గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీసారా విక్రయాల పై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటన పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఈ ఘటన గురించి పూర్తి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

#tamil-nadu-assembly
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి