Telangana: ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు..

ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి బైఠాయించారు. ఉమెన్ హాస్టల్ విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి.. యూనివర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. మెస్ ఛార్జీలను విపరీతంగా వేసి దోచుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు.

OU PG: 'వన్ టైం ఛాన్స్'.. పీజీ బ్యాక్ లాగ్స్ అభ్యర్థులకు ఓయూ బంపర్ ఆఫర్!
New Update

Osmania University Students Protest: ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University) తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి బైఠాయించారు. ఉమెన్ హాస్టల్(Women Hostel) విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి.. యూనివర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. మెస్ ఛార్జీలను(Mess Charges) విపరీతంగా వేసి దోచుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు. విద్యార్థుల ఆందోళనలతో యూనివర్సిటీలోని రోడ్డుంతా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో అలర్ట్ అయిన ఉస్మానియా పోలీసులు.. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థినులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉమెన్ పోలీసులు తమపై విచక్షణా రహితంగా దాడి చేశారంటూ ఆరోపిస్తున్నారు విద్యార్థినులు. హాస్టల్‌లో భోజనం సరిగా లేకపోగా.. మెస్ ఛార్జీలను భారీగా వేస్తున్నారని, ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న తమపై పోలీసులు దాడి చేయడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడి తెరంగేట్రంపై రేణు దేశాయ్ ఎమన్నారంటే..?

భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్…ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్

#students-stage-protest #women-hostel #osmania-university-students #osmania-university
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe