/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Kishan-Reddy.jpg)
Kishan Reddy:కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. కిషన్‌రెడ్డి ఇంటిని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యువజన విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్, అవకతవకలపై NTAను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. కిషన్‌రెడ్డి అపాయింట్ మెంట్ కోరినా ఇవ్వలేదని నిరసనలకు విద్యార్థి సంఘాలు దిగాయి. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తం అయింది. బల్మూరి వెంకట్ సహా పలువురు విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్ చేసి నల్లకుంట పీఎస్‌కు తరలించారు.