/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/RTV-A.jpg)
Gadari Kishore: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లతో ఇరు పార్టీల కార్యకర్తలు దాడి చేసుకున్నారు. కోడి గుడ్లు విసురుకున్నారు. ఘర్షణలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. లాఠీఛార్జి చేసి వాళ్ళను చెదరగొట్టారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్ నేతల నిరసన చేపట్టారు. అదే సమయంలో అటు వైపు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు.. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి చేసిన నేపథ్యంలో అక్కడికి వెళ్తున్న మాజీ మంత్రి ,సూర్యాపేట MLA జగదీష్ రెడ్డిని తిమ్మాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
Follow Us