High Salary Job: ఏడాదికి రూ.70లక్షల శాలరీ సంపాదించుకునే జాబ్‌ ఇది.. ఈ కోర్సు నేర్చుకుంటే లైఫ్‌ సెట్!

డేటా సైంటిస్ట్‌కి ఉన్న డిమాండ్‌ దేశంలో మరే ఇతర జాబ్స్‌కి లేదు. డేటా సైంటిస్ట్‌ ఏడాదికి సగటును రూ.13లక్షలు సంపాదిస్తున్నాడు. మనం డెవలెప్‌ అయ్యే కొద్దీ ఏడాదికి రూ.70లక్షల వరకు సంపాదించుకోవచ్చు. జేఈఈ(JEE) మెయిన్, జేఈఈ(JEE) అడ్వాన్స్‌డ్, గేట్ లాంటి వివిధ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల ఆధారంగా అన్ని డేటా సైన్స్ కళాశాలలకు అడ్మిషన్లు జరుగుతాయి. ఇక సగటు డేటా సైన్స్ కోర్సు ఫీజు రూ.70,000 - రూ.4,50,000 మధ్య ఉంటుంది.

New Update
High Salary Job: ఏడాదికి రూ.70లక్షల శాలరీ సంపాదించుకునే జాబ్‌ ఇది.. ఈ కోర్సు నేర్చుకుంటే లైఫ్‌ సెట్!

Data Scientist Jobs: మార్కెట్‌లో ఏది బెస్ట్ జాబ్ అంటే చెప్పడం కష్టమే. ఎవరి అభిప్రాయం వాళ్లు చెబుతారు. మార్కెట్ ఎక్స్‌పర్ట్స్‌ కూడా ఒకరి అభిప్రాయానికి మరొకరి అభిప్రాయానికి తేడా ఉంటుంది. ఇక హై శాలరీ జాబ్స్‌ విషయంలో కూడా టాలెంట్‌ని బట్టి జీతం ఉంటుంది. అయితే కొన్ని జాబ్స్‌కి మాత్రం ఫ్రెషర్స్‌ స్టేజీ నుంచే ఎక్కువ జీతం వస్తుంది. అందులో డేటా సైంటిస్ట్ జాబ్ ఒకటి. ప్రతి పరిశ్రమలో దీని అప్లికేషన్‌ కారణంగా ఈ జాబ్‌కి డిమాండ్‌ ఎక్కువ ఉంది. డేటాను విశ్లేషించి, ఫలితాలను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల డేటా శాస్త్రవేత్తలకు జీతాలు భారీగా ఇస్తున్నారు.

ఏ స్కిల్స్ కావాలి?
దేశంలో డేటా సైంటిస్ట్‌గా పని చేయడానికి స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో మంచి పట్టు కావాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగం లేదా గణాంకాలు లాంటి సబ్జెక్ట్ ఏరియాలో సంబంధిత డిగ్రీ ప్రయోజనకరంగా ఉంటుంది. బిజినెస్, ఫైనాన్స్ లేదా ఇతర రంగాలలో నైపుణ్యం కలిగి ఉండటం కూడా డేటా సైంటిస్ట్‌గా బెస్ట్ పొజిషన్‌లోకి వెళ్లడానికి బెటర్‌గా ఉంటుంది. దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న జాబ్స్‌ డేటా సైంటిస్ట్‌ జాబ్‌ (Data Scientist Job) ఒకటి. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది.

డేటా సైంటిస్ట్ జీతం ఎంత:
డేటా సైంటిస్ట్ యావరేజ్‌ శాలరీ ఏడాదికి రూ.13,35,000. అది కాకుండా ఏడాదికి అదనంగా రూ.1,35,000 వస్తుంది. అవి బెనిఫిట్స్‌. గ్లాస్‌డోర్‌లో మొత్తం 10,512మంది శాలరీను పరిగణనలోకి తీసుకున్నారు. నెలకు టేక్‌ హోం శాలరీ రూ.67వేల వరకు ఉంటుంది. ఇక్కడ ఫ్రెషర్స్‌కే స్టార్టింగ్‌ శాలరీ ఏడాదికి రూ.5లక్షల వరకు ఉంటుంది. డేటా సైంటిస్ట్‌లో టాప్‌ శాలరీ ఏడాదికి రూ.70 లక్షలు. అమెజాన్, డెలాయిట్, EY, IBM, మైక్రోసాఫ్ట్ డేటా సైన్స్ కోసం రిక్రూట్ చేసే కొన్ని టాప్‌ కంపెనీలు. డేటా సైంటిస్ట్‌లను రిక్రూట్ చేయడంలో ప్రపంచంలో రెండో అత్యధిక దేశంగా భారత్‌ నిలుస్తోంది. డేటా సైంటిస్ట్‌ల కోసం ఒక్క భారత్‌లోనే 2026 నాటికి దాదాపు 11 లక్షల ఉద్యోగావకాశాలు ఉంటాయని కూడా అంచనా. జేఈఈ(JEE) మెయిన్, జేఈఈ(JEE) అడ్వాన్స్‌డ్, గేట్ లాంటి వివిధ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల ఆధారంగా అన్ని డేటా సైన్స్ కళాశాలలకు అడ్మిషన్లు జరుగుతాయి. అభ్యర్థులు మరింత జ్ఞానాన్ని పొందడానికి, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులను కూడా అభ్యసించవచ్చు. సగటు డేటా సైన్స్ కోర్సు ఫీజు రూ.70,000 - రూ.4,50,000 మధ్య ఉంటుంది.

ALSO READ: ఎన్టీపీసీలో కొలువుల జాతర..495 పోస్టులకు రిక్రూట్ మెంట్..!!

Advertisment
తాజా కథనాలు