Patel Ramesh Reddy: సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న అనుచరులు

సూర్యాపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నామినేషన్ ఉపసంహరించుకునేలా బుజ్జగించడానికి వచ్చిన ఏఐసీసీ నేత రోహిత్ చౌదరి, సీనియర్ నేత మల్లు రవిని రమేష్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Patel Ramesh Reddy: సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న అనుచరులు

సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి (Patel Ramesh Reddy) ఇంటి దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. సూర్యాపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా రమేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారం కూడా ప్రారంభించారు. దీంతో ఆయన నామినేషన్ ఉపసంహరించుకునేలా ముఖ్యనేతలు బుజ్జగిస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి సూర్యాపేటలోని రమేష్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రమేష్‌ రెడ్డి అనుచరులు భారీగా తరలివచ్చి అడ్డుకుని ఆందోళన చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Hyderabad: ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో ‘కోట్ల’ కట్టలు..

వారి వాహనాలపై దాడికి కూడా ప్రయత్నించినట్లు సమాచారం. మరో వైపు రమేష్ రెడ్డి సైతం బరిలో నుంచి తప్పుకునేది లేదని తనను కలిసిన నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ చెప్పినట్లుగా విని గత ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని దామోదర్ రెడ్డి కోసం పని చేసినట్లు ఆయన గుర్తు చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గర్తుపై బరిలోకి దిగిన పటేల్ రమేష్ రెడ్డి ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. స్థానిక అభ్యర్థి అయినా తనను గెలిపించాలని కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు