Telangana High Court fines Bandi Sanjay: బండి సంజయ్ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 ఎన్నికల్లో గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ఎన్నిను సవాల్ చేస్తూ బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దాఖలైన పిటిషన్‌లో అడ్వికేట్ కమిషనర్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్‌కు బండి హాజరుకావాలని గతంలో హైకోర్టు ఆదేశం ఆదేశాలిచ్చినా తను గైర్హాజరుకావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బండి సంజయ్‌కు 50 వేల రూపాయాలను జరినామా విధించింది. ప్రస్తుతం బండి అమెరికాలో ఉన్నారు. అందువలన నేడు గడువు ఇవ్వాని బండి సంజయ్ తరపు లాయర్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. అయితే ఈ పిటిషన్‌పై 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ బీజేపీ ఎంపీ బండి సజయ్ కుమార్ తెలంగాణ హైకోర్టును (Telangana High Court) ఆశ్రయించారు. అయితే జూలై 21న కొంత సమయం కావాలి బండి సంజయ్ కోరారు. అయితే.. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం జూలై 21 నుంచి 31 తేదీల్లో లాయర్ కమిషన్ ముందు వ్యక్తి గతంగా హాజరు కావాల్సింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. న్యాయవాది తన క్లయింట్ బండి సంజయ్‌కు కొంత సమయం కావాలని కోరారు.
అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 12న బండి సంజయ్ హాజరవుతారని న్యాయవాది తెలిపారు. ఈ విషయంపై హైకోర్టు తీవ్రంగా దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ.. ఎన్నికల పిటిషన్ కొట్టివేయవచ్చని వెల్లడించింది. అంతేకాకుండా బండి సంజయ్ అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు అడ్వకేట్ కమిషన్ ముందు హాజరు కావడానికి అనుమతించవచ్చని కోర్టును కోరారు. పదేపడే విచారణ వాయిదా వేసినందుకు ఆర్మీ వెల్పేర్ ఫండ్‌కు రూ. 50 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నేల ( సెప్టెంబర్ 20న 2023)కి వాయిదా వేసింది.
Also Read: తెలంగాణలో ఐదు రోజులు వానలే..వానలు!