Hai NannaMovie: సమయమా భలే సాయం చేశావమ్మా ఒట్టుగా..అంటున్న నాని!

నాని మాత్రం మాస్ సినిమాలకు దూరంగా జరిగి తండ్రి కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో ‘హాయ్ నాన్న‘ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్స్ ఇప్పటికే మంచి ఆదరణ అందుకున్నాయి. ఇప్పుడు సినిమా ప్రమోషన్ లో భాగంగా తొలి లిరికల్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

New Update
Hai NannaMovie: సమయమా భలే సాయం చేశావమ్మా ఒట్టుగా..అంటున్న నాని!

నేచురల్ స్టార్ నాని సినిమా సినిమకు వైవిధ్యం కనబరుస్తూ ఉంటారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో మూవీలు తీస్తూ ఉంటారు. ఇటీవల దసరా మూవీతో బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టిన నాని తర్వాతి సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నాని మాత్రం మాస్ సినిమాలకు దూరంగా జరిగి తండ్రి కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో ‘హాయ్ నాన్న‘ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్స్ ఇప్పటికే మంచి ఆదరణ అందుకున్నాయి. ఇప్పుడు సినిమా ప్రమోషన్ లో భాగంగా తొలి లిరికల్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

‘సమయమా..భలే సాయం చేసావమ్మా ఒట్టుగా..కనులకే తన రూపాన్ని అందించావు గుట్టుగా..’ అంటూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి, సితార కృష్ణకుమార్ తమ వాయిస్‌తో మెసర్మైజ్ చేశారు. ఈ పాట వింటున్నా కొద్దీ వినాలి అనిపించేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ లిరికల్ వీడియోలో నాని, మృణాల్ ఠాకూర్ కెమెస్ట్రీ కూడా ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండ నటించిన ఖుషి మూవీకి సంగీతంతో అలరించిన అబ్దుల్ వహాబ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. ఈ మూవీకి కూడా మంచి మెలోడి మ్యూజిక్ ఇచ్చినట్లు ఈ సాంగ్ వింటుంటే అర్థమవుతోంది.

యువ దర్శకుడు శౌర్య దర్శకత్వం వహిస్తున్న ‘హాయ్ నాన్న‘ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాని కూతురిగా బేబి కైరా ఖన్నా కనిపించనుంది. ఇక స్టార్ హీరోయిన్ శృతిహాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు .డిసెంబర్ 21న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేస్తామని మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు