Tapsee Pannu Marriage: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్..!

స్టార్ హీరోయిన్ తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మార్చి 23న డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బోతోను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం సన్నిహితులు మాత్రమే వీరి పెళ్ళి వేడుకలకు హాజరైనట్లు సమాచారం.

New Update
Tapsee Pannu Marriage:  సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న  స్టార్ హీరోయిన్..!

Tapsee Pannu Marriage: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ ఇండస్ట్రీలో సొట్ట బుగ్గల సుందరిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. మంచు మనోజ్ నటించిన 'ఝమ్మంది నాదం' తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు స్టార్ హీరోల సరసన నటించింది. అయితే తెలుగులో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ అమ్మడుకు ఏ మాత్రం కలిసి రాలేదు. స్టార్ డమ్ దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసిన ఈ భామకు కాలం కలిసొచ్చింది వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో అటు బాలీవుడ్, టాలీవుడ్ లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. రీసెంట్ షారుఖాన్ సరసన డంకీ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.

Suma Kanakala Holi: హోలీ రోజు గుడ్లు, టమోటోలతో.. యాంకర్ సుమ చేసిన పని చూస్తే షాకవుతారు..!

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తాప్సీ

ఇది ఇలా ఉంటే.. తాజాగా తాప్సీ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బోతో తో చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ.. వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. మార్చి 20న ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైనట్లు.. 23 న ఉదయపూర్ ఉదయ్‌పుర్‌లో తాప్సీ- మథియాస్‌ జరిగినట్లు సమాచారం. కేవలం సన్నిహితులు మాత్రమే వీరి పెళ్ళి వేడుకలకు హాజరైనట్లు నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది.

publive-image

అయితే తాప్సీ స్నేహితురాలు ప్రొడ్యూసర్ కనిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'మేరే యార్‌కీ షాదీ' అనే హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఈ వార్తలకు మరింత బలం చేకూరేలా ఉన్నాయి. ఇక నటుడు పవైల్‌ కూడా తాప్సీ సోదరి.. షగ్ను పన్నుతో పాటు మరికొందరు ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోను షేర్ చేశాడు. దీంతో తాప్సీకి పెళ్ళైపోయిందని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు.

Also Read: Barrelakka pre wedding Video: బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్.. శిరీష భర్త ఎలా ఉన్నాడో మీరే చూడండి!

Advertisment
తాజా కథనాలు