Actress Tamannah Bhatia : సినీ ఇండస్ట్రీ (Cine Industry) లో మిల్కీ బ్యూటీ (Milky Beauty) తమన్నా (Tamannah) కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. సౌత్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రెజెంట్ నార్త్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కొన్నాళ్ల క్రితం ఆఫర్స్ తగ్గడంతో గ్లామర్ డోస్ ఓ రేంజ్ లో పెంచి.. బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాల్లోనూ నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ లు సైతం చేస్తున్న తమన్నా జీవితాన్ని హెబ్బాళలోని సింధీ ఉన్నత పాఠశాలలో పాఠ్యాంశంగా చేర్చారు.
ఆ పాఠశాలలో ఏడో తరగతి తరగతి పాఠ్యాంశంలో సింధీ వ్యక్తుల గురించి ఓ అంశాన్ని రూపొందించారు.ఇందులో హీరోయిన్ తమన్నా భాటియాతో పాటూ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) గురించి పాఠ్యాంశంగా చేర్చారు. అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని తల్లిదండ్రులు మండిపడ్డారు. సింధీ సామాజికవర్గంలో ఎంతో మంది కళాకారులున్నారని, వారి గురించి పాఠ్యాంశంగా ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు.
Also Read : ‘కల్కి’కి పైరసీ దెబ్బ.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ఫుల్ మూవీ, షాక్ లో నిర్మాతలు!
దీన్ని వ్యతిరేకించినందుకు తమ పిల్లలకు టీసీ ఇస్తామని పాఠశాల యాజమాన్యం బెదిరిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాఠశాల యజనమాన్యం విద్యార్థుల తల్లి దండ్రులను బుజ్జగిస్తూ అదొక పాఠ్యేతర అంశంగా చేర్చినట్లు, సింధీ సామాజికవర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చామని తెలిపింది.