Sreeleela and Anil Ravipudi: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దుసుకుపోతోంది యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela). అందంతోపాటు అదృష్టం కూడా ఆమెకు తోడుగా ఉంటోంది. శ్రీలీల నటించిందంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ తెలుగు చిత్రపరిశ్రమలో ఏర్పడింది. టాలీవుడ్ లో కృతీ శెట్టిలాంటి హీరోయిన్లకు కూడా పక్కకు నెట్టి దూసుకుపోతోంది బ్యూటీ. నార్త్ భామలకు ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrsihna) హీరోగా రాబోతున్న భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాలో శ్రీలీల నటించింది. ఇందులో శ్రీలీల.. బాలకృష్ణకు కుమార్తెగా కనిపించనుంది. ఇటీవలే విడుదల అయిన సినిమా ట్రైలర్, టీజర్, పాటలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈక్రమంలో దర్శక, నిర్మాతలతో పాటు బాలయ్య బాబు, కాజల్ అగర్వాల్, శ్రీలీలలు వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. గ్రూపుగా, సింగిల్ గా ఇంటర్వ్యూలు ఇస్తూ చెలరేగిపోతున్నారు. అయితే తాజాగా హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ అనిల్ రావిపూడి కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూనే.. అందరూ ఆశ్చర్యపడే కొన్ని విషయాలను తెలిపారు.
Also Read: స్టార్ కమెడియన్ వేణుమాధవ్ కు అరుదైన గౌరవం..!!
శ్రీలీలతో తనకు ఉన్న బంధుత్వం గురించి వివరించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి . శ్రీలీల అమ్మ డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పంగులూరు అని.. తన అమ్మమ్మది కూడా అదే ఊరని ఆయన తెలిపారు. శ్రీలీల తల్లి తనకు వరుసకు అక్క అవుతుందని చెప్పారు. శ్రీలీల తెలుగు గడ్డపై పుట్టిందని.. అయితే బెంగళూరు, అమెరికాలో చదువుకుందని తెలిపారు. ప్రతి ఏటా పంగులూరుకు వస్తుంటుందని చెప్పారు.
మరోవైపు సెట్స్ లో అనిల్ ను డైరెక్టర్ గారూ అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేని సమయంలో మామయ్యా అని పిలుస్తుందట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అంతే కాదు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Also Read: Allu Arjun - అసలు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఇదే..!!