/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/keerthi-suresh-jpg.webp)
Heroine Keerthy Suresh: మహానటి అంటే ఇప్పటి జనరేషన్ కు సీనియర్ యాక్టర్ సావిత్రి కన్నా..నటి కీర్తి సురేశే ఎక్కువుగా గుర్తొస్తారు. తెలుగులో 'నేను శైలజ' అనే సినిమాతో హీరోయిన్ గా ఆరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సిని ప్రేక్షకులకు దగ్గరయింది. అందం, అమాయకత్వంతో తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకుంది.
నాచురల్ స్టార్ నానితో నేను లోకల్ సినిమాలో నటించి యూత్ ను కట్టిపడేసింది. హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్ వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ఈ సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి వేరే లెవల్ కు వెళ్లిపోయింది. ఆమె నటనకి యావత్ తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు. టాలివుడ్ లో మహానటి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన కీర్తి సురేశ్ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
అయితే, హీరోయిన్ గా తన సక్సెస్ ని కొనసాగిస్తున్న సమయంలోనే పలు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది. తమిళంతో పాటు తెలుగులోనూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. ఆ తరువాత తన నుంచి వచ్చిన ఏ సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వలేదు.
రిసెంట్ గా నేచురల్ స్టార్ నాని సరసన దసరా చిత్రంలో కీర్తి సురేశ్ నటించిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత నానికి దసరా చిత్రంతో బాక్సాఫీస్ హిట్ దక్కింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) వెన్నెల పాత్రలో సూపర్ గా నటించింది. వరుస ఫ్లాప్స్ తరువాత ఈ సినిమాతో సక్సెస్ సాధించింది.
తాజాగా, కీర్తి సురేష్ దీపావళి సెలెబ్రేషన్స్ లో ఎల్లో చీర కట్టులో బంగారంలా మెరిసిపోతోంది. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ ఏమీ అందం రా బాబు.. సొగసు చూపు తిప్పుకోలేని విధంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: వైరల్ అవుతున్న నీహారిక లవ్ లెటర్