Hero Yash: భార్య కోసం కిరాణా షాప్ కు వెళ్లిన స్టార్ హీర్ యష్.. వైరలవుతున్న ఫొటోస్

కేజీఎఫ్ స్టార్ యష్ ఫ్యామిలీతో కలిసి షిరాలీలోని చిత్రపుర మఠాన్ని సందర్శించారు. అక్కడ యష్.. తన భార్య కోసం ఒక చిన్న దుకాణంలో ఐస్ క్యాండీస్ కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు యష్ సో సింపుల్ అంటూ ప్రశంశిస్తున్నారు.

Hero Yash: భార్య కోసం కిరాణా షాప్ కు వెళ్లిన  స్టార్ హీర్ యష్.. వైరలవుతున్న ఫొటోస్
New Update

Hero Yash: ఎంత ఎదిగినా ఒదిగే ఉండేవారు అతి కొద్ది మందే ఉంటారు. పాన్‌ ఇండియా స్టార్‌ యశ్ అలాంటి వారే. వరుస సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా అతను మాత్రం సింపుల్‌గా ఉండేందుకే ఇష్టపడతాడు. ఇక ఇష్టమైన వాటిని కొనుక్కొవడానికి హోదాతో పనిలేదు. మనసుకు నచ్చితే చాలు. ఇప్పుడు యశ్‌ కూడా తన భార్య కోసం అలాంటిదే ఒకటి చేశాడు.. అదేంటో తెలుసుకోండి

కిరాణా షాప్ లో భార్యకు క్యాండీస్ కొనిచ్చిన యష్

ఇటీవలే స్టార్ హీరో యష్ ఫ్యామిలీతో కలిసి భత్కల్‌లోని షిరాలీకి వెళ్లారు. అక్కడ యష్ చిత్రపురి మఠాన్ని సందర్శించుకున్నారు. అయితే అక్కడ భార్య రాధిక ఐస్ క్యాండీస్ అడగడంతో పక్కనే ఉన్న ఓ చిన్న కిరాణా దుకాణానికి వెళ్లారు యష్. ఆ చిన్న షాప్ లో భార్యకు ఐస్‌ క్యాండీస్ చాక్లెట్లు కొనిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన యష్ అభిమానులు ఆయన పై ప్రశంశలు కురిపిస్తున్నారు. ఒక స్టార్ హీరోగా ఖరీదైన హోటల్స్ లో తినే స్థోమత, లక్జరీ లైఫ్ అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ.. యష్ ఇంత సింపుల్ గా ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్ గా ఉండడం అంత చిన్న విషయం కాదు .. సో గ్రేట్ అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Pushpa: తగ్గేదెలే.. పుష్ప పార్ట్ 3 కూడా.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్

బుల్లి తేర యాక్టర్ గా కెరీర్ స్టార్ చేసిన యష్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన నటించిన కేజీఎఫ్ సినిమా రికార్డు వసూళ్లతో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం యష్ మలయాళంలో టాక్సిక్ సినిమా చేస్తున్నారు. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు

Also Read: Allu Arjun: బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అల్లు అర్జున్ కు ఆహ్వానం.. ‘పుష్ప’ స్పెషల్ స్క్రీనింగ్

#hero-yash #kgf
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe