/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-31T204503.651-jpg.webp)
Chiranjeevi: 2024 గణతంత్ర వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాజీ మంత్రి వెంకయ్య నాయుడును పద్మ విభూషణ్ వరించింది. సినీ, సేవా రంగంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన మెగాస్టార్ ఈ అవార్డు అందుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సామాన్య ప్రజల నుంచి రాజకీయ, సినీ ప్రముఖుల వరకు చిరంజీవికి అభినందనల వర్షం కురిపిస్తున్నారు. కొంత మంది స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెబితే.. మరి కొంత మంది సోషల్ మీడియా వేదికగా వారి విషెస్ తెలియజేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Snapinsta.app_424470077_1846214855810258_4147913188779100507_n_1080-jpg.webp)
Also Read: Bigg Boss Sohel: యాంకర్ సుమ చేసిన పనికి.. ఎమోషనల్ అయిన సోహైల్
పద్మ విభూషణ్ చిరంజీవికి తరుణ్ అభినందనలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Snapinsta.app_422909980_1070350284292369_7944520478200346527_n_1080-jpg.webp)
తాజాగా టాలీవుడ్ నటుడు తరుణ్, నటి రోజా రమణి- చక్రపాణి దంపతులు కుటుంబ సమేతంగా పద్మ విభూషణ్ చిరంజీవిని.. ఆయన నివాసంలో కలిసి పుష్ప గుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను హీరో తరుణ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. "ప్రతిష్టాత్మక అవార్డు పద్మ విభూషణ్ వరించిన మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు. యావత్ సినీ వర్గానికి ఇది గర్వకారణం .. మీరు నిజంగా ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అంటూ రాసుకొచ్చారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Snapinsta.app_423602192_399749795760399_8564762093241469362_n_1080-jpg.webp)
View this post on Instagram
Also Read: Chiranjeevi: పద్మ శ్రీ పురస్కార గ్రహితలను సత్కరించిన .. మెగాస్టార్ చిరంజీవి
Follow Us