Hero Surya: డీఎండీకే అధినేత విజయకాంత్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరో సూర్య.!(వీడియో)

కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ సమాధి వద్ద స్టార్ హీరో కన్నీరు పెట్టుకున్నారు. విజయకాంత్ మృతి చెందినప్పుడు సూర్య షూటింగ్ కారణంగా విదేశాల్లో ఉన్నారు. నిన్న చెన్నైకు తిరిగొచ్చిన ఆయన నేడు విజయకాంత్ సమాధి వద్ద నివాళి అర్పించారు.

Hero Surya: డీఎండీకే అధినేత విజయకాంత్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరో సూర్య.!(వీడియో)
New Update

Hero Surya Emotional video: కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరో లందరూ ఆయనకు నివాళలర్పించారు. అయితే, విజయకాంత్ మృతి చెందినప్పుడు షూటింగ్ కారణంగా విదేశాల్లో ఉన్నారు స్టార్ హీరో సూర్య. నిన్న చెన్నైకు తిరిగొచ్చిన ఆయన నేడు విజయకాంత్ సమాధి వద్ద నివాళి అర్పించారు. కెప్టెన్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read:  ‘బ్రహ్మముడి’ కావ్య సీరియల్ లో నటించక ముందు ఏం చేసేదో తెలుసా?

నటుడు విజయకాంత్, హీరో సూర్య 'పెరియన్నా' అనే తమిళ సినిమాలో కలిసి నటించారు. కెరీర్ ఆరంభంలో నాలుగు సినిమాల్లో నటించినప్పటికీ తనకు గుర్తింపు రాలేదని.. ఆ సమయంలో  విజయకాంత్ తో కలిసి పని చేశానని తెలిపారు సూర్య. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేయాలని ఆయన ప్రోత్సహించేవారని చెప్పుకొచ్చారు. అందరితో ఎంతో మంచిగా మాట్లాడేవారని అన్నారు. విజయకాంత్ మరణం తనను షాక్ కు గురి చేసిందని.. ఆయన మరణం చిత్ర సీమకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.

#vijayakanth-death #hero-surya
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe