Bommarillu Re-Release: సిద్దార్థ్ 'బొమ్మరిల్లు' రీ రిలీజ్.. ఫ్యాన్స్ కు పండగే

సిద్దార్థ్, జెనీలియా జంటగా నటించిన చిత్రం బొమ్మరిల్లు. 2006లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ కు సిద్దమైనట్లు తెలుస్తోంది. హీరో సిద్దార్థ్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 17న మరో సారి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్.

New Update
Bommarillu Re-Release: సిద్దార్థ్ 'బొమ్మరిల్లు' రీ రిలీజ్.. ఫ్యాన్స్ కు పండగే

Bommarillu Re-Release: సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ హవా జోరుగా కొనసాగుతోంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సూపర్ హిట్ చిత్రాలను.. మరో సారి థియేటర్స్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్.. జోరుగా కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా మరో సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్ కు సిద్దమైనట్లు టాక్ వినిపిస్తోంది.

సిద్దార్థ్ బొమ్మరిల్లు రీ రిలీజ్

2006 లో విడుదలైన బొమ్మరిల్లు చిత్రం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిద్ధార్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమాలోని పాటలు, కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద 100 రోజులు ఆడిన సినిమాగా సెన్షేషన్ క్రియేట్ చేసింది. సూపర్ సక్సెస్ అందుకున్న ఈ మూవీ.. కలెక్షన్ల వర్షం కురిపించింది. యువతను ఎంతగానో అట్రాక్ట్ చేసిన ఈ సినిమా.. మరో సారి రీ రిలీజ్ కు సిద్ధమైంది. హీరో సిద్దార్థ్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 17న రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Director Yashasvi: ‘నాలా ఇంకెవరూ మోసపోవద్దు’.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్‍ పై వైరలవుతున్న యశస్వి కామెంట్స్

publive-image

ఇక ఇటీవలే రీ రిలీజైన సిద్దార్థ్ 'ఓయ్' ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా పాటలు, సీన్స్ తెగ వైరలయ్యాయి. అప్పట్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఓయ్ సినిమాకే ఈ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందంటే.. ఇక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ బొమ్మరిల్లు హవా ఏ విధంగా ఉండబోతుందా..? అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమా ఎలాంటి సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువ, బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఓయ్, ఆట సినిమాలతో లవర్ బాయ్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రేక్షకులకు కాస్త దూరమైన సిద్దార్థ్.. రీసెంట్ గా 'చిన్నా' సినిమాతో మళ్ళీ విజయాన్ని అందుకున్నారు.

Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్ 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు