Hi Nanna: 'హాయ్ నాన్న' కలెక్షన్ జోరు కొనసాగుతుందా..?

'హాయ్ నాన్న' అంటూ ప్రేక్షకులను మెప్పించారు నాని. రొమాంటిక్ డ్రామా గా రీలీజైన ఈ చిత్రం అందరినీ బాగా ఆకట్టుకుంది. ఐదు రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో 27.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ వారం పెద్ద సినిమాల రిలీజ్ లేనందున కలెక్షన్స్ మరింత పెరిగే చాన్స్ ఉంది.

Hi Nanna: 'హాయ్ నాన్న' కలెక్షన్ జోరు కొనసాగుతుందా..?
New Update

Hi Nanna Collections: హయ్ నాన్న' చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు హీరో నాని (Hero Nani). ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా పెప్పించింది. రిలీజైన మొదటి రోజు కలెక్షన్స్ పర్వాలేదు అనే రేంజ్ లో  ఉన్నప్పటికీ.. సినిమా పై వచ్చిన పాజిటివ్ టాక్ తో రెండవ రోజు నుంచి కలెక్షన్స్ పుంజుకున్నాయి. ప్రస్తుతం 'హయ్ నాన్న' లాభాల బాటలో స్టడీగా సాగుతున్నాయి.

నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాళి ఠాకూర్ (Mrunal Thakur) కథానాయికగా విడుదలైన చిత్రం 'హాయ్ నాన్న'. డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 7 న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 21 న విడుదల కానున్న ఈ చిత్రం సలార్, డుంకీ పెద్ద సినిమాలు క్ల్యాష్ అవ్వడంతో ముందుగానే రిలీజ్ చేశారు.

Hi Nanna Collections

Also Read: Thandel: నాగ చైతన్య ‘తండేల్’ షూటింగ్.. ఎక్కడో తెలుసా..?

విడుదలైన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.5 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 5.1 కోట్ల గ్రాస్, ఓవర్ సీస్ లో 4.2 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు నుంచి కలెక్షన్స్ మరింత పుంజుకున్నాయి. హాయ్ నాన్న సినిమాకు 30. 65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ చేరడానికి 31 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమా విడుదలై ఐదు రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో 27.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. ఓవర్ సీస్ లో 14 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత వారం కూడా పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. 'హాయ్' నాన్న ఈ వారం మాత్రమే కలెక్షన్స్ ఎక్కువగా రాబట్టే ఛాన్స్ ఉంది. రాబోయే వారాల్లో ప్రభాస్ సలార్, షారుఖాన్ డుంకీ రిలీజ్ ఉన్నందున కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Hi Nanna Collections

Also Read: Salaar Song: ఇదికదా.. ఫ్యాన్స్ కి కావలసింది.. ఒక్క సాంగ్ తో సలార్ ఎమోషనల్ దుమ్మురేపాడు

#hi-nana-movie #hi-nana-movie-collections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి