Kolkata Rape Case: ఇలాంటివి ఆపాలంటే అదొక్కటే మార్గం..! ట్రైనీ డాక్టర్ ఘటన పై హృతిక్ పోస్ట్..!

కోల్‌క‌తా జూనియర్ డాక్టర్ హ‌త్యాచార ఘ‌ట‌న‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ ఘటన పై బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ స్పందించారు. ఇలాంటి దురాగతాలకు అడ్డుకట్టవేయడానికి కఠినమైన శిక్షలే ఏకైక మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు

New Update
Kolkata Rape Case: ఇలాంటివి ఆపాలంటే అదొక్కటే మార్గం..! ట్రైనీ డాక్టర్ ఘటన పై హృతిక్ పోస్ట్..!

Hrithik Roshan: ఇటీవలే కోలకతాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచారం దేశవ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే పలు వైద్య కలశాలలు, డాక్టర్లు, వైద్య విద్యార్థులు ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. మరో వైపు ఈ ఘటనపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

ట్రైనీ డాక్టర్ ఘటన పై హృతిక్ రోషన్ పోస్ట్

అయితే తాజాగా ఈ ఘటన పై బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా స్పందించారు. మహిళా డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆవేదనను వ్యక్తం చేశారు. హృతిక్ తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు. "అందరు సురక్షితంగా, సమానంగా ఉండే సమాజం కావాలి. కానీ అది పరిణామం చెందాలంటే దశాబ్దాలు పడుతుంది. సురక్షితమైన సమాజం కుమారులను, కుమార్తెలను శక్తివంతంగా చేయడంలో తోడ్పడుతుంది. రాబోయే తరాలు బాగుపడతాయి. ఇలాంటి దురాగతాలను జరగకుండా ఉండాలంటే నిందితులకు కఠినమైన శిక్షలు విధించడం ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాను. నిన్న రాత్రి దాడికి గురైన వైద్యులందరికీ సపోర్ట్ గా ఉంటానని తెలిపారు."

స్పందించిన బాలీవుడ్ నటులు 

అంతే కాదు బాలీవుడ్ నటులు జెనీలియా, కరీనా కపూర్, ప్రీతి జింటా, కంగనా రనౌత్, అలియా భట్, రిచా చద్దా కూడా ఈ ఘటన పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరీనా కపూర్ ... “12 సంవత్సరాల తరువాత, అదే కథ, అదే నిరసన. కానీ మేము ఇంకా మార్పు కోసం ఎదురు చూస్తున్నాము అని ఆవేదన వ్యక్తం చేసింది"

Also Read: Stree 2: ఫైటర్, కల్కి రికార్డులు బ్రేక్.. ఫస్ట్ డే 'స్త్రీ 2' కలెక్షన్స్ - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు