/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-02T201430.657-jpg.webp)
Gopichand : కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో గోపీచంద్(Gopichand) హీరోగా రాబోతున్న సినిమా భీమా(Bheema). శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపి చంద్ 30 వ చిత్రం 'రామబాణం' మంచి టాక్ వచ్చినప్పటికీ.. కొంత వరకే సంతృప్తిని కలిగించలేకపోయింది. ఇక ప్రస్తుతం రాబోతున్న భీమా సినిమా పై ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమాలో గోపి చంద్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇక గోపి చంద్ మరో సారి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి.. తన పంథాకు బిన్నంగా.. ఈ కథను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలోని హై యాక్షన్ సీక్వెన్సెస్ మంగళూరులో దట్టమైన అడవి ప్రాంతంలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా చిత్ర బృందం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. అభిమానులకు నూతన సంవత్సర శుభాకంక్షాలు తెలిపారు. అలాగే ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు హీరో గోపి చంద్. రేపు జనవరి 3 న 5:04 గంటలకు మరో బిగ్ అప్డేట్ రివీల్ చేయబోతున్నట్లు.. ఇది చాలా స్పెషల్, పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలిపారు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ సినిమా రిలీజ్(Cinema Release) డేట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రీసెంట్ గా వచ్చిన గోపీచంద్ 'పక్కా కమర్షియల్' ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత 'రామబాణం'(Ramabanam) కొంత వరకు సంతృప్తిని ఇచ్చింది. ఈ సినిమాలు గోపీచంద్ కు భారీ విజయాలను అందించలేకపోయాయి. ఇక ఈ సారి భీమాతో హిట్ కొట్టి మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంటారా..? చూడాలి. కె.జీఎఫ్ ఫేమ్ రవి బసూర్ మ్యూజిక్ డైరెక్టర్ గా సంగీతం అందించారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన మాళవిక శర్మ, భవాని శంకర్ నటిస్తున్నారు.
View this post on Instagram
Team #BHIMAA wishes you all a very Happy & Prosperous New Year 🎉
As we step in to the 2024, here's to a year filled with joy, courage and countless moments to cheer 🤗#HappyNewYear@YoursGopichand @nimmaaharsha @priya_Bshankar @ImMalvikaSharma @KKRadhamohan @RaviBasrur pic.twitter.com/p5WcnEUYhh
— BHIMAA (@BhimaaMovie) January 1, 2024
Also Read : Anasuya latest photos : ఫ్యామిలీతో కలిసి జిమ్ లో అనసూయ వర్క్ ఔట్స్.. వైరలవుతున్న ఫొటోస్