BHIMAA:  'భీమా' సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. రివీల్ చేసిన గోపీచంద్

డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భీమా'. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా గోపీచంద్ సోషల్ మీడియా వేదికగా మరో అప్డేట్ రివీల్ చేశారు. జనవరి 5 న భీమా టీజర్ రిలీజ్ కానున్నట్లు తెలిపారు.

BHIMAA:  'భీమా'  సినిమా నుంచి క్రేజీ అప్డేట్..  రివీల్ చేసిన గోపీచంద్
New Update

Gopichand Bhimaa Movie: గోపీచంద్ కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో రాబోతున్న సినిమా 'భీమా'. ఈ సినిమాలో మాళవిక శర్మ, భవాని శంకర్ గోపీచంద్ సరసన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ సత్య సాయి క్రియేషన్స్ బ్యానర్ పై రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. గోపీచంద్ 31వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా స్పెషల్ అండ్ పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ మంగళూరు అడవి ప్రాంతంలో షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Anasuya latest photos: ఫ్యామిలీతో కలిసి జిమ్ లో అనసూయ వర్క్ ఔట్స్.. వైరలవుతున్న ఫొటోస్

publive-image

ఇక తాజాగా గోపీచంద్ ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ రివీల్ చేశారు. భీమా టీజర్ జనవరి 5న రిలీజ్ కానున్నట్లు.. ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టర్ ను షేర్ చేశారు. ఫుల్ యాక్షన్ మోడ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటూ కామెంట్స్ చేస్తున్నారు. గోపి చంద్ రెగ్యులర్ స్టోరీ సెలెక్షన్ కు బిన్నంగా ఈ కథను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. మరి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా గోపిచంద్ కు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కాబోతుందా చూడాలి.

Also Read: Gopichand : న్యూ ఇయర్ కు హీరో గోపి చంద్ బిగ్ అప్డేట్.. ఏంటో తెలుసా..!

#gopichand-bhima #bhima-teaser-date
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe