/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/allu-arjun-jpg.webp)
Allu Arjun: పుష్ప మూవీ సక్సెస్ తో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది.పుష్ప సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న బన్నీ అదే జోష్ తో పుష్ప సీక్వెల్ లోనూ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. అటు సినిమాలతోనూ ఫుల్ బిజి బిజిగా ఉన్న ఈ హీరో.. ఇటు సోషల్ మీడియాలోనూ తన క్రేజ్‌ను పెంచుకుంటూ దూసుకెళ్తున్నారు. ఎంత అంటే టాలీవుడ్ హీరోల్లోనే అత్యధికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో 23.5 మిలియన్ల మంది ఫాలోవర్లు హీరో అల్లు అర్జున్. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకొచ్చిందంటే తాజాగా బన్నీ (Allu Arjun) తన లేడీ ఫ్యాన్ కోసం ఓ సెల్ఫీ వీడియో తీశాడు. ఇందులో తన ఫ్యాన్‌తో ఫన్నీగా మాట్లాడాడు బన్నీ.
Today This Mrng When He Comes To Vote , He Just Promoted A Fan's Insta Account .,
How SWEET He Is 😹❤️@alluarjun
— KODUVA ™ (@KoduvaOffl_) November 30, 2023
ఆ వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నీకు బాగా ఫాలోవర్లు రావాలని మంచి వీడియో తీస్తాను. నీకు ఎంతమంది ఫాలోవర్లు కావాలి.. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు. 13 వేల మంది ఉన్నారా? మినిమమ్ ఇప్పుడు ఎంతకి టచ్ అవ్వాలి అంటూ బన్నీ అడిగారు. దీనికి 20 వేలు లేదా 30 వేలు అంటూ ఆ అమ్మాయి ఆన్సర్ ఇచ్చింది. దీంతో సరే 30కే కావాలా ఈ వీడియోతో వస్తారా? అంటూ నవ్వుతూ సెల్ఫీ వీడియో తీశాడు బన్నీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ బన్నీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: ఓటు వేయడానికి తరలివస్తున్న ప్రముఖులు, రాజకీయ నాయకులు
Follow Us