Goodachari 2 : అడివిశేష్ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్.. మొదలైన షూటింగ్..!

అడివిశేష్ హీరోగా శశి కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గూఢచారి 2. 2018లో విడుదలైన గూఢచారి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా సీక్వెల్ గూఢచారి 2 షూట్ ప్రారంభం అయినట్లు అడివిశేష్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Goodachari 2 : అడివిశేష్ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్.. మొదలైన షూటింగ్..!
New Update

Goodachari 2: టాలీవుడ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) మేజర్, హిట్ 2 సినిమాలతో మంచి కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. మంచి కథలతో ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం అడివిశేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా గూఢచారి 2. 2018లో శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో స్పై యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిన గూఢచారి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 కథను ప్లాన్ చేస్తున్నట్లు ఏప్రిల్ 2020 లో క్లారిటీ ఇచ్చారు అడివిశేష్.

ఇక ఇప్పుడు తాజాగా గూఢచారి 2 కు సంబంధించి సూపర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అడివిశేష్ గూఢచారి 2 (Goodachari 2) షూటింగ్ ప్రారంభం అయినట్లు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. సినిమా క్లాప్ బోర్డు ఫొటోను షేర్ చేస్తూ.. మ్యాసివ్.. #G2 అని క్యాప్షన్ పెట్టారు. ఈ మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో అడివిశేష్ సూట్ వేసుకొని డైనమిక్ ఏజెంట్ లుక్ లో కనిపించారు.

Also Read: Vasanthi Krishnan: పవన్ తో బిగ్ బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్.. పిక్స్ వైరల్!

publive-image

గూఢచారి 2 సీక్వెల్ లో అడివిశేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ బ‌నితా సంధు నటించనున్నారు. G2 సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్పై యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం హై స్టాండర్డ్ సినిమాటిక్ వ్యాల్యూస్ తో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

publive-image

Also Read: Guntur Kaaram Song: ‘ఓహ్‌ మై బేబీ..’ వచ్చేసింది.. మహేశ్‌బాబు-శ్రీలీల కిరాక్‌ కాంబో..!

#adivi-sesh #goodachari-2
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి