Hema: జైలు నుంచి విడుదలైన సినీ నటి హేమ- VIDEO

బెంగళూరు జైలు నుంచి సినీనటి హేమ విడుదలైంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

New Update
Hema: జైలు నుంచి విడుదలైన సినీ నటి హేమ- VIDEO

Actress Hema: బెంగళూరు జైలు నుంచి సినీ నటి హేమ విడుదలైంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) డ్రగ్స్ కేసులో హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

ఈ మేరకు బెంగళూరు నగర శివారులో ఒక ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఆమెకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి ఆమెను విడుదల చేశారు. ఈ కేసులో ఆమెను బెంగుళూరు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు విచారించి అరెస్ట్ చేయగా.. ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఇక హేమ దగ్గర ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల దగ్గర సాక్షాలు కూడా లేవని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే హేమ రేవ్ పార్టీలో పాల్గొన్న ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Advertisment
తాజా కథనాలు