Kedarnath Helicopter Incident: కేదార్‌నాథ్ కొండల్లో హెలికాప్టర్‌లో సాంకేతికలోపం తలెత్తింది.హెలిప్యాడ్ కు 100మీటర్ల దూరంలో ఉండగా ఇంజన్ లో ప్రాబ్లమ్ వచ్చింది. హెలికాప్టర్ రూటర్ దెబ్బతింది. హెలికాప్టర్‌ను హెలిప్యాడ్ వరకు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పైలట్ ప్రయత్నాలు చేశాడు. ఐతే ల్యాండింగ్ అవుతుండగా హెలికాప్టర్‌లో కుదుపులు చోటుచేసుకున్నాయి.
ఇలా జరగడంతో హెలికాప్టర్‌లో ఉన్న భక్తుల్లో టెన్షన్ నెలకొంది. సురక్షితంగా ల్యాండింగ్ చేసేందుకు పైలట్ యత్నాలు.. ఐతే ల్యాండింగ్ ప్రదేశంలో పెద్ద గుంట ఉండడంతో ల్యాండింగ్ పై ఉత్కంఠ నెలకొంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భక్తులు బిక్కుమన్నారు. తమను కాపాడాలంటూ కేదారనాథునికి ప్రార్థనలు చేశారు. తీవ్ర ఉత్కంఠ తర్వాత సురక్షితంగా హెలికాప్టర్ ల్యాండ్ అయింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు భక్తులు. పైలట్ అప్రమత్తతతో పెను ముప్పు తప్పింది.
Also Read: రజనీకాంత్‌కు అరుదైన గౌరవం.. UAE గోల్డెన్ వీసా దక్కించుకున్న సూపర్ స్టార్